Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
300 రోగాలను నయం చేసే శక్తి..ఆషాడంలో తప్పక తినాల్సిన మునగాకు పప్పు..ఎలా చేసుకోవాలంటే
మునగాకు పప్పు అనేది ఒక సంప్రదాయమైన, అత్యంత ఆరోగ్యకరమైన భారతీయ వంటకం. మునగాకును సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పప్పుతో కలిపి వండటం వల్ల ఇది రుచిగా ఉండటమే కాకుండా, పోషకాలతో నిండిన ఒక సంపూర్ణ భోజనంగా మారుతుంది. ఆషాఢ మాసంలో మునగాకు పప్పు తినడం అనేది కేవలం రుచి కోసమే కాకుండా, మన పూర్వీకులు ఆలోచించి పెట్టిన ఆరోగ్య రహస్యం. ఈ సంప్రదాయం వెనుక వాతావరణ మార్పులు, శరీర ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధం ఉంది.
ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది. మునగాకులో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మునగాకు పప్పును ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెరుగుతుంది. వర్షాకాలంలో ముఖ్యంగా ఆషాఢంలో, జీర్ణశక్తి కొద్దిగా మందగిస్తుందని నమ్ముతారు. మునగాకులో ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, బి-కాంప్లెక్స్ విటమిన్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. పప్పుతో కలిపి తినడం వల్ల ప్రోటీన్ శాతం మరింత పెరుగుతుంది, ఇది సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది. వర్షాకాలంలో తక్కువ జీర్ణశక్తి కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. మునగాకు స్వతహాగా కొద్దిగా శరీరంలో వేడిని పెంచుతుందని అంటారు.

మునగాకు పప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు
మునగాకులు- 2కప్పులు
కందిపప్పు-1 కప్పు
టమాటో- 1
పచ్చిమిర్చి- 5
చింతపండు- 30 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు- 5, 6
పసుపు- అర టీస్పూన్
ఉప్పు- ఒకటిన్నర టీస్పూన్
ఎండుమిర్చి- 2
కరివేపాకు- అరకప్పు
ఆవాలు- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ఆయిల్- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో శుభ్రంగా కడిగిన 1కప్పు కందిపప్పు, 2కప్పుల కడిగిన మునగాకు, 5 పచ్చి మిరపకాయల చీలికలు, 1టమాటో ముక్కలు,నిమ్మకాయ సైజు అంత చింతపండు, అర టీస్పూన్ పసుపు,3కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి స్టవ్ మీద పెట్టి 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత మూతతీసి ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దగా కారం వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోపి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, ముక్కలుగా కట్ చేసిన 3 ఎండుమిరపకాయలు వేసి వేయించాక ఇందులో కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి 1 నిమిషం వేగనిచ్చి కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు తాళింపులో ఉడికించిన మునగాకు పప్పుని వేసి కలుపుకోవాలి. 5 నిమిషాలు సిమ్ లో ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన,ఆరోగ్యకరమైన మునగాకు పప్పు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
