Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
10 నిమిషాల్లో కరకరలాడే ఉల్లిపాయ రవ్వ దోసె..ఈ రెసిపీ మిస్సవ్వద్దు!
రోజూ అదే ఇడ్లీ, అదే దోసె తిని విసుగొచ్చిందా? అయితే, ఆ బోరింగ్ టిఫిన్ కు ఇక వీడ్కోలు చెప్పండి. పిండి నానబెట్టే పని లేకుండా, రుబ్బే శ్రమ అస్సలు లేకుండా కేవలం 10 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకోగలిగే అద్భుతమైన ఉల్లిపాయ రవ్వ దోసెను ట్రై చేయండి. ఇది క్రిస్పీగా, రుచిగా ఉండటమే కాదు, చాలా తేలికగా కూడా ఉంటుంది. ఉదయం హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం వేడివేడి స్నాక్ గా ఇది ఒక అద్భుతమైన ఎంపిక. పిల్లల లంచ్ బాక్సులకు కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. నోరూరించే హోటల్ స్టైల్ రవ్వ దోసె ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఉల్లి రవ్వ దోసె తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) -అర కప్పు
బియ్యం పిండి - అర కప్పు
మైదా పిండి - పావు కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2
దంచిన నల్ల మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
తరిగిన కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
తరిగిన కరివేపాకు - కొద్దిగా
పచ్చి కొబ్బరి తురుము - 1 టేబుల్ స్పూన్
పుల్లటి మజ్జిగ (లేదా నీళ్ళు) - 2 కప్పులు
ఉప్పు - రుచికి తగినంత
నూనె - దోసెలు కాల్చడానికి

తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, మైదా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, దంచిన మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు కొద్దికొద్దిగా మజ్జిగ పోసుకుంటూ ఉండలు లేకుండా చేతితో లేదా విస్క్ తో బాగా కలుపుకోవాలి. ఈ దోసెకు పిండి నీళ్లగా, జారుడుగా ఉండటమే అసలైన రహస్యం. దోసె పిండి కంటే చాలా పలుచగా ఉండాలి.
-ఇప్పుడు ఈ పిండిపై మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. ఈ సమయంలో రవ్వ నాని, పిండి కొద్దిగా చిక్కబడవచ్చు. అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి, మళ్లీ పలుచగా చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ పై నాన్ స్టిక్ పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కాక గరిటెతో పిండిని తీసుకుని అంచుల నుండి మధ్యలోకి చుట్టూరా పోయాలి. సాధారణ దోసెలా రుద్దకూడదు, పిండి దానంతట అదే జల్లెడలాగ పరుచుకుంటుంది. దోసె చుట్టూ ఒక టీస్పూన్ నూనె వేసి మీడియం మంటపై కాలనివ్వండి.
-దోసె అంచులు బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యేవరకు కాల్చాలి. రవ్వ దోసెను రెండో వైపు తిప్పాల్సిన పనిలేదు. దోసె బాగా కాలిన తర్వాత దానిని సగానికి మడిచి ప్లేట్ లోకి తీసుకోండి. అంతే వేడివేడి, కరకరలాడే ఉల్లిపాయ రవ్వ దోసె రెడీ.
-దీనిని కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడి లేదా సాంబార్ తో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications