Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా!
బయట వైపు కొద్దిగా కరకరలాడుతూ, లోపల దూదిలా మెత్తగా ఉండి.. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే వెల్లుల్లి, వెన్నల సువాసనతో కట్టిపడేసే గార్లిక్ నాన్ తినడం ఒక అద్భుతమైన ఫుడ్ ఎక్స్పీరియన్స్. అయితే తందూర్ లేదా పెద్ద పెద్ద మైక్రోవేవ్ ఓవెన్లు లేకుండా ఇలాంటి నాన్ ఇంట్లో చేయడం కష్టమని చాలామంది భావిస్తుంటారు. కానీ వంటగదిలోని పెనంపైనే అచ్చం హోటల్ స్టైల్ గార్లిక్ నాన్ ను చాలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

పెనం మీద గార్లిక్ నాన్ తయారీ విధానం
-ఒక గిన్నెలో పిండి తీసుకుని అందులో కొద్దిగా పెరుగు, నూనె, రుచికి సరిపడా ఉప్పు వేసి తగినంత నీటితో మెత్తటి ముద్దలా కలపండి. మీరు కావాలనుకుంటే దీనికి కొద్దిగా ఈస్ట్ వాడుకోవచ్చు, కానీ ఈస్ట్ లేకపోయినా నాన్ అద్భుతంగా వస్తుంది. పిండి ముద్ద ఎంత మృదువుగా ఉంటే మీ నాన్ అంత సాఫ్ట్ గా వస్తుంది.
-పిండిని కలిపిన వెంటనే నాన్ చేయకూడదు. దానిపై ఒక తడి వస్త్రాన్ని లేదా మూతను కప్పి ఉంచి, కనీసం ఒకటి లేదా రెండు గంటల పాటు అలానే వదిలేయండి. ఈ సమయంలో పిండి బాగా నానుతుంది. పిండి ముద్ద తేలికగా మారి, మెత్తటి ఆకృతిని పొందుతుంది.
-ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వెన్నను కరిగించండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఫ్రెష్ కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి. కావాలంటే చిటికెడు ఉప్పు కూడా జోడించండి. ఈ స్పెషల్ మిశ్రమమే మీ నాన్ కు అచ్చమైన రెస్టారెంట్ టచ్ ఇస్తుంది.
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
-నానిన పిండిని చిన్న ముద్దలుగా తీసుకుని, చపాతీ కర్రతో గుండ్రంగా కాకుండా కొద్దిగా పొడవుగా (ఓవల్ షేప్ లో) మందంగా ఒత్తండి. వండేటప్పుడు అది బాగా అతుక్కోవడానికి, దానిపై సన్నగా తరిగిన వెల్లుల్లి, కొత్తిమీర చల్లి ఒకసారి చేత్తో గట్టిగా నొక్కండి. ఇప్పుడు నాన్ రెండో వైపు కొద్దిగా నీళ్లు రాయండి. బాగా వేడెక్కిన ఇనుప పెనం మీద, నీళ్లు రాసిన వైపు వేయండి. నీళ్ల వల్ల నాన్ పెనానికి గట్టిగా అతుక్కుంటుంది, అస్సలు జారిపోదు.
-నాన్ పైన చిన్న చిన్న బుడగలు రావడం మొదలవ్వగానే, పెనాన్ని అమాంతం తలకిందులుగా తిప్పి స్టవ్ మంట మీద నేరుగా నాన్ ను కాల్చండి. ఇలా చేయడం వల్ల అచ్చం తందూరిలో కాల్చినట్లే స్మోకీ ఫ్లేవర్, అద్భుతమైన రంగు వస్తాయి. ఒకవేళ ఇలా చేయడం మీకు కష్టంగా అనిపిస్తే, పెనం మీదే రెండో వైపు కూడా దోరగా కాల్చుకోవచ్చు.
-బాగా కాలిన నాన్ను పెనం మీద నుంచి తీసిన వెంటనే, వేడి మీద ఉండగానే మనం ముందుగా సిద్ధం చేసుకున్న గార్లిక్ బటర్ ను బ్రష్ తో పూయండి. వేడి వేడి నాన్ ఆ వెన్నను పీల్చుకుని మరింత జ్యూసీగా, సువాసనభరితంగా మారుతుంది.
-అంతే టేస్టీ గార్లిక్ నాన్ రెడీ. పనీర్ బటర్ మసాలా, మలై కోఫ్తా, చోలే లేదా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీతో దీన్ని లాగించేయొచ్చు. పెరుగు, సలాడ్ తో వడ్డించినా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications