Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
నోరూరించే మామిడికాయ - చేపల పులుసు

కావలసిన పదార్థాలు:
చేపలు: 1/2kg
మామిడి కాయ: 1
ఉల్లిపాయలు: 4
వెల్లుల్లి రెబ్బలు: 4-6
జీలకర్ర: 1/2tsp
పసుపు: 1/2tsp
ధనియాలు: 2tbsp
పచ్చిమిర్చి: 6-8
కరివేపాకు: 1cup
కొత్తిమీర: ఒక కట్ట
మిరపపొడి: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేసే విధానం:
1. ముందుగా చేపలు శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి వాటిపై ఉప్పు, పసుపు పట్టించి పక్కన ఉంచుకోవాలి.
2. ఈలోపు ఉల్లిపాయలను మెత్తగా నూరుకొని ఒక పాత్రలో ఉల్లిపాయల పేస్ట్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, మిరపపొడి, కొత్తిమీరలను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ విశ్రమాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న చేపలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి.
4. తరువాత మామిడికాయను ముక్కలుగా కోసి ఒక పాత్రలో నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి.
5. ఇప్పుడు మరో గిన్నెలో కొద్దిగా నూనె వేసి మసాల పట్టించి పెట్టుకొన్ని చేపముక్కలను అందులో వేసి 2నిమిషాలు వేయించి కొద్దిగా నీళ్లు పోయాలి.
6. తర్వాత అందులోనే ముందుగా ఉడికించుకున్న ఈ మామిడి కాయ మిశ్రమాన్ని చేపముక్కలు ఉడుకుతున్నపాత్రలో వేసి చిన్న మంటపై నెమ్మదిగా ఉడికించుకోవాలి. కావాలనుకొంటే మామిడి కాయ ముక్కలను కూడా కొద్దిగా చేర్చుకోవచ్చు. చేప ముక్కలు ఉడికాయని నిర్ధారించుకున్న తర్వాత దించుకోవాలి.



Click it and Unblock the Notifications