Latest Updates
-
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక
స్పైసీ దహీ మటన్ రిసిపి-స్పెషల్ టేస్ట్
దహీ మటన్ రిసిపి ఒక క్లాసిక్ డిష్. దీన్ని ఎక్కువగా రోడ్ సైడ్ డాబాల్లో ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇది మటన్ వెరైటీలో ఇది ఒకటి. దీన్ని తయారు చేయడం చాలా సులభం మరియు అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది.
దహీ మటన్ రిసిపికి మటన్ ముక్కలను పెరుగులో మ్యారినేట్ చేసి తయారు చేయడం వల్ల అంతటి అద్భుతమైన టేస్ట్ ను అంధిస్తుంది. దహీమటన్ రిసిపి మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టమైన వంటకం. ఇందులో కొంత స్పైసీని జోడించడం వల్ల మరింత అద్భుతంగా ఉంటుంది. టేస్టీ గా ఉంటుంది. ఈ దహీ మటన్ రిసిపి అన్నం, చపాతీ, పరోటాల్లోనికి చాలా అద్భుతంగా ఉంటుంది.

పెరుగు: 1 cup
ఉల్లిపాయ: 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
కొత్తిమీర పొడి: 2tsp
కాశ్మీరీ కారం: 1tsp
పసుపు: 1tsp
జీలకర్ర పొడి: 2tsp
గరం మసాలా పొడి: 1tsp
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
కసూరి మెంతి(ఎండిన మెంతులు ఆకులు) : 2tsp
నెయ్యి: 2tbsp
నీళ్ళు: 1cup
తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ముక్కలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పెరుగు, కాశ్మిరీ రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా మరియు ఉప్పు వేసి బాగా మిక్సె చేసి అందులోనే శుభ్రం చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మసాలాపొడులతో మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఈ మటన్ ను మూడు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
3. 3గంటల తర్వాత పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక, అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, వేసి ఒక నిముషం వేగించాలి.
4. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాల పాటు మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేగించుకోవాలి. స
5. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు కూడా వేసి పది నిముషాల పాటు వేగించుకోవాలి. మటన్ ముక్కలనుండి నీరు మొత్తం ఇగిరిపోయే వరకూ వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా వేసి 3 నిముషాలు వేగించుకోవాలి.
8. తర్వాత అందులో ఎండిన మెంతి ఆకులను అరచేతిలో వేసుకొని పొడిపొడిగా చేసి ఫ్రైలో వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
9. తర్వాత సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మూత పెట్టి 20-25నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. ఇకసారి మటన్ ముక్కలు ఉడికిందని నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి.
ఈ స్పైసీ దహీ మటన్ రిసిపి వేడి వేడి అన్నం లేదా పరోటాలకు చాలా మంచి కాంబినేషన్



Click it and Unblock the Notifications