Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
North india special recipe: నార్త్ ఇండియా స్పెషల్ 'వెజ్ హండీ దివానీ'..మాటల్లో వర్ణించలేని టేస్ట్,ఎలా చేయాలంటే
వెజ్ దివానీ హండీ అనేది నార్త్ ఇండియాలో చాలా ప్రసిద్ద వంటకం. ఇది వివిధ రకాల కూరగాయలను, సుగంధభరితమైన గ్రేవీలో కలిపి దీనిని తయారుచేస్తారు. 'దివానీ' అనే పదం 'రాజకుటుంబానికి చెందిన' అని అర్థం ఇస్తుంది..'హండీ'అంటే మట్టి కుండ. ఈ వంటకం దాని రాయల్ రుచి,ప్రత్యేకమైన తయారీ విధానానికి ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా ప్రత్యేక సందర్భాలలో లేదా విందులలో తయారుచేస్తారు.
వెజ్ దివానీ హండీ..అన్నం, రోటీ లేదా నాన్‌తో చాలా రుచిగా ఉంటుంది. వెజ్ దివానీ హండీ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

వెజ్ దివానీ హండీ తయారీకి కావలసిన పదార్థాలు
క్యారెట్ - 1
బంగాళాదుంప - 1
కాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
పచ్చి బఠానీలు - 1/2 కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - 1/2 కప్పు
ఫ్రెంచ్ బీన్స్ - 1/4 కప్పు
పనీర్ - 100 గ్రాములు
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - 10-12
బాదం పప్పు - 8-10
పాలు లేదా క్రీమ్ - 1/2 కప్పు
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు పొడి - 1/2 టీ స్పూన్
కారం పొడి - 1 టీ స్పూన్
ధనియాల పొడి - 1 టీ స్పూన్
జీలకర్ర పొడి - 1/2 టీ స్పూన్
గరం మసాలా - 1/2 టీ స్పూన్
కసూరి మేథీ - 1 టీ స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర -కొంచెం
కర్ణాటక స్పెషల్ చికెన్ చాప్స్..తింటే ఆ మజానే వేరు,ఎలా చేయాలంటే
వెజ్ దివానీ హండీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో వేడి నీరు పోసి జీడిపప్పు, బాదం పప్పులను 15-20 నిమిషాలు నానబెట్టాలి.
-నానిన తర్వాత వాటిని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా పాలు లేదా నీరు కలపవచ్చు.
-ఇప్పుడు అన్ని కూరగాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-పనీర్ ఉపయోగిస్తుంటే దానిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందం ఉంటే బాండీ పెట్టి నూనె లేదా నెయ్యి వేడి చేయాలి.
-నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-ఇప్పుడు టమోటా గుజ్జు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
-పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
-తయారుచేసుకున్న జీడిపప్పు, బాదం పేస్ట్ వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు ఉడికించాలి.
-పెరుగు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి, కొద్దిగా ఉడికించాలి.
-ఇప్పుడు కట్ చేసుకున్న అన్ని కూరగాయలు వేసి గ్రేవీతో బాగా కలపాలి.
-రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి.
-కొద్దిగా నీరు పోసి మూత పెట్టి మీడియం మంటపై కూరగాయలు మెత్తగా ఉడికే వరకు సుమారు 15-20 నిమిషాలు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
-కూరగాయలు ఉడికిన తర్వాత గరం మసాలా, కసూరి మేథీని చేతులతో నలిపి వేయాలి.
-తర్వాత పాలు లేదా క్రీమ్ వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి.
-వేయించిన పనీర్ ముక్కలు వేసి మెల్లగా కలపాలి.
-చివరగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంటే వెజ్ దివానీ హండీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications