Latest Updates
-
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్!
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
పూరీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ రెసిపీస్ అంటే ఆలూ కుర్మా, పప్పు, చోలే మసాలా. ఇవి లేనిదే పూరీ, చపాతీలు తిన్న ఫీలింగ్ అనిపించదు. ఇక చోలే మసాలాను వీటితో కంటే ఉత్తి కర్రీ తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. శనగల మసాలా కర్రీ అంటే నార్త్ స్టైల్ ఫేమస్ అని చెప్పవచ్చు. ఈ సారి పూరీ, చపాతీల్లోకి ఢిల్లీ స్టైల్లో చోలే మసాలాను ఇలా చేయండి. ఒకటి రెండు పూరీలు ఎక్కువ తినేస్తారు. చోలే మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం..

చోలే మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు
కాబూలీ శనగలు- కప్పు(250 గ్రాములు)
బంగాళాదుంపలు- రెండు
పసుపు- పావు టీస్పూన్
నెయ్యి- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రెండు టీస్పూన్లు
నూనె- టేబుల్ స్పూన్
మసాలా దినుసులు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
ఉల్లిపాయలు- రెండు
పచ్చి మిరపకాయ- ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
టమాటాలు- రెండు
కశ్మీరీ కారం- రెండు టీస్పూన్లు
ధనియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
చనా మసాలా- రెండు టీస్పూన్లు
మిరియాల పొడి- అర టీస్పూన్
పాలక్ ప్యూరీ- పావు కప్పు
చింతపండు రసం- పావు కప్పు
బెల్లం- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
చోలే మసాలా తయారీ విధానం

ముందుగా కాబూలీ శనగలను కడిగి 8 గంటలపాటు నానబెట్టుకోవాలి. రాత్రంతా నానబెట్టుకుంటే ఉదయం టిఫిన్‌లోకి చేసుకోవచ్చు.
శనగలు నానిన తర్వాత.. బంగాళాదుంపల తొక్క తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు శనగలను, బంగాళాదుంప ముక్కలను కుక్కర్లో తీసుకుని నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా నెయ్యి, పసుపు వేసి 6 లేదా 7 విజిల్స్ వచ్చేవరకు మీడియం మంటపైన ఉడికించుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత తీసి అందులో ఉప్పు వేసి కలిపి కాసేపు ఉడికించుకోవాలి. స్టవ్‌పైన బాణలి పెట్టుకుని అందులో నూనె వేసి కాగనివ్వాలి. టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక మసాలా దినుసులు, జీలకర్ర వేసి వేయించాలి.

చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఉడికించాలి. రెండు టమాటాలను మెత్తగా రుబ్బుకుని ఆ ప్యూరీని బాణలిలో వేసి వేయించుకోవాలి.
టీస్పూన్ కశ్మీరీ కారం, ధనియాల పొడి, చనా మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలిపి ఉడికించాలి. తాజా పాలకూర కట్టను కట్ చేసి కడిగి మిక్సీలో రుబ్బిన తర్వాత బాణలిలో వేసి ఉడకనివ్వాలి. చింతపండు రసం, కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి.
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.!
రెండు నిమిషాల తర్వాత ఉడికించిన శనగలు, బంగాళాదుంపలను నీళ్లతో సహా బాణలిలో వేసి కలుపుకోవాలి. మసాలాలు మొత్తం కలిసేలా కలుపుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మాషర్‌తో శనగలు, బంగాళాదుంప ముక్కలు కొంచెం మెత్తగా అయ్యేలా ప్రెస్ చేయండి. తర్వాత మీకు నచ్చినట్లుగా గ్రేవీకి సరిపడా కొన్ని నీళ్లు పోసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి.
ఇప్పుడు మరో స్టవ్‌పైన చిన్న కడాయి పెట్టుకుని అందులో మిగిలిన నెయ్యి వేసి కాగిన తర్వాత ఎండు మిర్చి, కరివేపాకు, టీస్పూన్ కశ్మీరీ కారం వేసి కలిపి ఆ తాలింపును చోలే మసాలాలో కలిపి చివర్లో కొత్తిమీర చల్లండి. స్టవ్ ఆఫ్ చేయడమే. టేస్టీ ఢిల్లీ స్టైల్ చోలే మసాలా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications