Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.!
మాంసాహార వంటకాల్లో లివర్‌ది ప్రత్యేక స్థానం. హెల్త్ పరంగానూ భోజనంలో లివర్ చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఇక, ఇవన్నీ పక్కన పెడితే వెజ్ ప్రియులు కూడా ఇష్టంగా లివర్‌ను తినేయొచ్చు. అలా అని వారి నాన్ వెజ్ తినాల్సిన పని లేదు. వెజ్ వంటకాలతోనే ఎంతో రుచిగా నాన్‌వెజ్‌ను మించిన టేస్ట్‌తో లివర్ ఫ్రై చేసుకోవచ్చు. ఆకుకూరల్లో బెస్ట్ అయిన తోటకూరతో వెజ్ లివర్ ఫ్రై చూస్తే ఎవరైనా నాన్‌వెజ్ అనుకొని పొరబడతారు. అలాంటి రుచికరమైన తోటకూర వెజ్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం..

తోటకూర వెజ్ లివర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
తోటకూర- ఐదు చిన్న కట్టలు
గార్లిక్- ఆరు రెబ్బలు
అల్లం- చిన్న ముక్క
పచ్చిమిర్చి- మూడు
జీలకర్ర పొడి- అర టీస్పూన్
ధనియాల పొడి- అర టీస్పూన్
శనగపిండి- అర కప్పు
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
జీలకర్ర- అర టీస్పూన్
ఉల్లిపాయలు- రెండు(మీడియం సైజు)
పచ్చిమిర్చి- మూడు
కరివేపాకు- కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
పసుపు- అర టీస్పూన్
కారం- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
గరం మసాలా పొడి- అర టీస్పూన్
మిరియాల పొడి- అర టీస్పూన్
టొమాటోలు- రెండు
తోటకూర వెజ్ లివర్ ఫ్రై తయారీ విధానం
ముందుగా లేత తోటకూర కట్టలను తీసుకుని వేర్లకి కొంచెం పై భాగం వరకు కట్ చేసుకుని లేత కాడలు, ఆకులతో సహా తీసుకోవాలి. వీటిని ఒకసారి చల్లటి నీళ్లతో కడగాలి.
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
తర్వాత స్టవ్‌పైన వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇందులో తోటకూరను వేసి కాసేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత జల్లెడ సాయంతో నీళ్లు పోయేలా వడగట్టాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఉడికిన తోటకూర, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మెత్తగా పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌లో శనగపిండి వేసి బాగా కలపాలి.
ఈ పేస్ట్‌ను ఒక చిన్న వెడల్పాటి బౌల్‌లో తీసుకుని కేక్ మాదిరిరిగా పరుచుకోవాలి. ఇడ్లీ స్టీమర్‌లో నీళ్లు పోసి ఆవిరిపైన మీడియం మంటపైన పదినిమిషాల పాటు ఉడికించాలి.

ఉడికిన తర్వాత స్పూన్ లేదా చాకుతో చెక్ చేసినట్లయితే అంటుకోకుండా వస్తుంది. అప్పుడు దీనిని వేరే ప్లేట్‌లోకి తీసుకుని క్యూబ్స్ మాదిరిగా చాకుతో కట్ చేసుకోవాలి.
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని ఈ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేవరకు వేయించుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కరివేపాకు వేసి కలపాలి. ఇందులోనే కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి వేగనివ్వాలి.
టమాటా ముక్కలను మిక్సీలో వేసి ప్యూరీలా చేసుకుని ఆ ప్యూరీని కడాయిలో వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి. చివరిగా వెజ్ లివర్ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. చివర్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టే అండ్ హెల్తీ తోటకూర వెజ్ లివర్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
