Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా?
బిర్యానీ అనగానే సాధారణంగా చికెన్, మటన్ లేదా వెజ్ దమ్ బిర్యానీలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఇక మునగకాయల విషయానికి వస్తే సాంబార్, చింతపండు పులుసు, ఇగురు లేదా మసాలా కూరగా వండుకుని తింటాం. కానీ ఎప్పుడైనా మునగకాయలతో ఘుమఘుమలాడే బిర్యానీని ట్రై చేశారా? దీని రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది.
బిర్యానీ ప్రియులు తమ జీవితంలో కచ్చితంగా రుచి చూడాల్సిన వంటకం ఇది. ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఎంతో సులభంగా, కమ్మగా మునగకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
మ్యారినేషన్ కోసం
బాస్మతి బియ్యం - 1 కప్పు
మునగకాయలు - 2
పెరుగు - ఒకటిన్నర టేబుల్ స్పూన్
కారం - 1 టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
బిర్యానీ తయారీకి
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - 2 ముక్కలు
లవంగాలు - 4
యాలకులు - 4
అనాస పువ్వు - 1
కల్పాసి- కొద్దిగా
సోంపు - అర టీస్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 1
పుదీనా - అర గుప్పెడు
కొత్తిమీర - కొద్దిగా
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
బిర్యానీ మసాలా పొడి - 1 టీస్పూన్
టమాటాలు - 2
కొబ్బరి పాలు - ఒకటిన్నర కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి.
-ఒక గిన్నెలో కట్ చేసుకున్న మునగకాయ ముక్కలు తీసుకోండి. అందులో పెరుగు, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా బాగా కలిపి, మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ పాత్రను పెట్టుకోండి. అందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బండపువ్వు, సోంపు వేసి సువాసన వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించండి. ఇప్పుడు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి.
-అందులోనే కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించండి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మునగకాయ ముక్కలను వేసి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా, తరిగిన టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించండి.
-టమాటాలు మగ్గాక కమ్మటి కొబ్బరి పాలను పోసి మూతపెట్టి మరగనివ్వండి. కొబ్బరి పాలు మరుగుతున్నప్పుడు, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి నిదానంగా కలపండి. ఉప్పు సరిచూసుకుని, పైన కొద్దిగా కొత్తిమీర చల్లి, మూతపెట్టి మంటను పూర్తిగా తగ్గించి 10 నిమిషాల పాటు దమ్ చేయండి.
-10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయండి. వెంటనే మూత తీయకుండా మరో 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే.. ఇల్లంతా సువాసనలు వెదజల్లే వేడివేడి మునగకాయ బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
