Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, లేదా పొంగల్. కానీ ఎప్పుడూ ఒకేలాంటి పొంగల్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి ఆరోగ్యానికి మేలు చేసే, నోటికి ఎంతో రుచిగా ఉండే గ్రీన్ పొంగల్(కొత్తిమీర పొంగల్) ట్రై చేయండి. కరివేపాకు, కొత్తిమీర సువాసనలతో ఘుమఘుమలాడే ఈ పొంగల్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

గ్రీన్ పొంగల్ తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - అర కప్పు
నీళ్లు - 4 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
కొత్తిమీర - 1 కప్పు
పచ్చిమిర్చి - 3 లేదా 4
కరివేపాకు - కొద్దిగా
మిరియాలు - 1 టీస్పూన్
నెయ్యి - 4 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
జీడిపప్పు - గుప్పెడు
అల్లం ముక్కలు - కొద్దిగా
ఇంగువ - చిటికెడు
గ్రీన్ పొంగల్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.
-కుక్కర్ తీసుకుని అందులో కడిగిన బియ్యం,పెసరపప్పు వేసి 4 కప్పుల నీళ్లు పోయాలి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, ఒక స్పూన్ కమ్మటి నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టాలి. 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి, తర్వాత మూత తీసి గరిటతో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.
-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర, 3-4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక ఒక స్పూన్ మిరియాలు వేసి, ఆ తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న కొత్తిమీర-కరివేపాకు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
-మరో చిన్న కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేడి చేసి, అందులో జీలకర్ర, జీడిపప్పులు వేసి దోరగా వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి మంచి సువాసన వచ్చాక.. ఆ తాలింపును నేరుగా పొంగల్ పైన వేసి కలపాలి.
-అంతే ఎంతో కమ్మని, ఆరోగ్యకరమైన కొత్తిమీర పొంగల్ రెడీ. దీనిని కొబ్బరి చట్నీ లేదా వేడి వేడి సాంబార్ తో తింటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications