Latest Updates
-
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.!
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు!
ప్రస్తుతం చాలా కొత్త కొత్త రోగాలు మనుషులను పట్టి పీడిస్తుండటంతో అందరూ బలమైన ఆహారం కోసం చూస్తన్నారు. ఈ క్రమంలో మన పూర్వీులు తిన్న జొన్నలు, రాగులు, సజ్జలు వంటి మిల్లెట్స్ వైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు.
మరికొందరు అయితే బియ్యం పూర్తిగా పక్కన పెట్టేసి మిల్లెట్స్ వంటకాలతోనే తమ కడుపు నింపుకుంటున్నారు. అయితే బియ్యం లేకుండా జొన్నలతో రోజంతా శక్తి ఇచ్చేటట్లు,మంచి బలాన్ని అందించే, పాత కాలం పద్ధతిలో జొన్నల అన్నం ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

జొన్నల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కప్పుపచ్చ జొన్నలు
-అర కప్పు పెసరపప్పు
-అర కప్పు పల్లీలు
-3 టమాటాలు
-4 పచ్చిమిరపకాయలు
-2 ఉల్లిపాయలు
-2 రెబ్బల కరివేపాకు
-కొత్తిమీర
-పుదీనా
-20 జీడిపప్పులు
-తగినంత ఉప్పు
-1 చెంచా ఆవాలు
-1 చెంచా మిరియాలు
-1 చెంచా జీలకర్ర
-2 ఎండుమిరపకాయలు
-1 ముక్క పచ్చి కొబ్బరి
-6 వెల్లుల్లి రెబ్బలు
-1 ఇంచు అల్లం
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది!
జొన్నల అన్నం తయారీ విధానం
-ముందుగా అరకప్పు పెసరపప్పును కడిగి కొద్దిసేపు నీటిలో నానబెట్టుకోవాలి.
-తర్వాత జొన్నలను మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉండేలానే గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు కుక్కర్ లో గ్రైండ్ చేసిన జొన్న మిశ్రమం, పల్లీలు(వేరుశెనగ గుళ్లు), నానబెట్టుకున్న పెసరపప్పు, జీలకర్ర, 2 ఉల్లిపాయల పెద్ద ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు, 3 టమాటోల ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, తగినంత ఉప్పు, పుదీనా,కొత్తిమీర, కరివేపాకు వేసి ఇందులోనే 4 కప్పుల నీళ్లు పోసుకొని ఇందులోని కొద్దిగా నూనె వేసి కలుపుకొని కుక్కర్ మూతపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి.జొన్నలు ఉడకడానికి ఆలస్యం వుతుంది. 4 విజిల్స్ వచ్చేవరకు ఉడకనిస్తే చాలు.
-ఈలోగా అందులోకి తాలింపు పెట్టుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 చెంచాల నెయ్యి వేసి వేడయ్యాక అందులో 20 జీడిపప్పులు, సన్నగా కట్ చేసిన 1 భాగం కొబ్బరి ముక్కలు, 1 చెంచా ఆవాలు, 2 ఎండుమిరపకాయల ముక్కలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.
-వేగిన తాలింపుని ఉడికిన జొన్న అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ జొన్నల అన్నం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications