Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పోషకాల రాగి హల్వా..రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
హల్వాలో బోలెడు వెరైటీలు ఉంటాయి. క్యారెట్ హల్వా, గుమ్మడికాయ హల్వా, సొరకాయ హల్వా ఇలా చాలానే ఉంటాయి. అయితే రుచిలో దేని ప్రత్యేకత దానిదే. అయితే మీరెప్పుడైనా రాగి హల్వా తిన్నారా? రాగి.. భారతదేశంలో ఎప్పటినుంచో సాగు చేయబడుతున్న ఒక పురాతన ధాన్యం. కేవలం జావ లేదా రొట్టెలకే పరిమితం కాకుండా రాగితో రుచికరమైన స్వీట్స్ కూడా తయారుచేయవచ్చు. వాటిలో రాగి హల్వా ఒకటి.
రాగి హల్వా అనేది రాగి పిండి, నెయ్యి, పంచదార లేదా బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ తో తయారుచేసే ఒక ఆరోగ్యకరమైన, రుచికరమైన తీపి వంటకం. రాగి హల్వా అటు పెద్దలకు, ఇటు పిల్లలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రాగి హల్వా తయారుచేయడం కూడా చాలా ఈజీ. మీ ఇంట్లోనే చాలా ఈజీగా రాగి హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాగి హల్వా తయారీకి కావలసిన పదార్థాలు
-రాగి పిండి: 1 కప్పు
-నెయ్యి: 1/2 కప్పు
-పంచదార: 1/2 కప్పు
-పాలు: 2 కప్పులు
-యాలకుల పొడి: 1/2 టీస్పూన్
-డ్రై ఫ్రూట్స్: 2 టేబుల్ స్పూన్లు తరుగు
-ఉప్పు: కొద్దిగా
సూపర్ హెల్దీ రాగి తోప..రక్తం పట్టడానికి, ఉక్కులాంటి ఎముకల కోసం ఇదే సరైనది..ఎలా చేసుకోవాలంటే
రాగి హల్వా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో 1 కప్పు రాగి పిండిని తీసుకోండి. దీనిలో 1 కప్పు పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇది పల్చని పేస్ట్ లాగా ఉండాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఆ తర్వాత కిస్మిస్ వేసి అవి ఉబ్బేవరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని నెయ్యిలో వేయండి. మంటను తక్కువగా ఉంచి నిరంతరం కలుపుతూ ఉండాలి. రాగి పిండి మంచి సువాసన వచ్చి,లేత గోధుమ రంగులోకి మారడం మొదలయ్యేవరకు వేయించాలి.
-రాగి పిండి బాగా వేగిన తర్వాత ఇందులో 1 కప్పు పాలను నెమ్మదిగా కలుపుతూ ఉండలు లేకుండా చూసుకోవాలి. మంటను తక్కువగా ఉంచి కలుపుతూనే ఉండాలి.
-మిశ్రమం చిక్కబడి పాన్ అంచులను వదిలేస్తుంటే ఇప్పుడు చక్కెర లేదా తురిమిన బెల్లం, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర పూర్తిగా కరిగి హల్వాతో కలిసిపోయేవరకు కలుపుతూ ఉండాలి. బెల్లం వాడుతుంటే బెల్లం కరిగేవరకు ఉడికించాలి. బెల్లం వేసిన తర్వాత హల్వా కొంచెం మెత్తబడుతుంది, మళ్లీ చిక్కబడే వరకు ఉడికించాలి.
-చివరగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌లో సగాన్ని హల్వాలో వేసి కలపండి. మిగిలిన వాటిని అలంకరణ కోసం పక్కన పెట్టుకోండి. ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. రాగి హల్వాను వేడిగా లేదా చల్లగా ఎలా తిన్నా సూపర్ గానే ఉంటది. పైన మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో అలంకరిస్తే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications