Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
కూరతో పనేలేదు.. ఒట్టిదే తినేసే రుచికరమైన వెజిటబుల్ చపాతీ..తయారీ ఇలా!
సాధారణంగా మన ఇళ్లలో రాత్రి భోజనానికి లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి చపాతీలు చేసుకోవడం సహజం. అయితే ప్రతిరోజూ ఒకే రకమైన సాదా చపాతీలు తినాలంటే ఎవరికైనా విసుగు పుడుతుంది. దానికి తోడు, చపాతీలోకి చేసిన కూరగాయలను తినడానికి పిల్లలు, కొందరు పెద్దలు కూడా ముఖం చాటేస్తుంటారు.
చపాతీ పిండిని కలుపుతున్నప్పుడే అందులో రకరకాల కూరగాయలను సన్నగా తరిగి వేయడం ద్వారా, చపాతీ రుచి అద్భుతంగా మారడమే కాకుండా, శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మామూలుగా తినే దానికంటే రెండు చపాతీలు ఎక్కువే లాగిస్తారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ వెజిటబుల్ చపాతీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి: 1 కప్పు
క్యాబేజీ: 100 గ్రాములు
క్యాప్సికమ్: సగం
ఉల్లిపాయ: 1
క్యారెట్: 1
కొత్తిమీర: కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
కారం: అర టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: సరిపడినంత
నీళ్లు: పిండి కలపడానికి తగినన్ని
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన కొత్తిమీర,రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా పిసికినట్లు కలిపి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలు మెత్తబడి ఉంటాయి. ఇప్పుడు అందులో పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు గోధుమ పిండిని వేసి, నీళ్లు పోయకుండా ముందుగా కూరగాయల్లోని తేమతోనే పిండిని బాగా కలపాలి.
-కూరగాయల మిశ్రమంలో పిండి బాగా కలిసిన తర్వాత అవసరమైతేనే కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి. చివరగా ఒక టీస్పూన్ నూనె వేసి మరోసారి పిసికి, 5 నిమిషాల పాటు నాననివ్వండి.
-నానిన పిండిని చిన్న చిన్న సమానమైన ఉండలుగా చేసుకోవాలి. పొడి పిండిని చల్లుకుంటూ చపాతీ కర్రతో మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్తంగా గుండ్రంగా ఒత్తుకోవాలి.
-స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక ఒత్తి పెట్టుకున్న చపాతీని వేయాలి. రెండు వైపులా కొద్దిగా నూనె లేదా నెయ్యి రాస్తూ బంగారు రంగు వచ్చే వరకు ఎర్రగా కాల్చుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచితే లోపల కూరగాయలు కూడా చక్కగా ఉడుకుతాయి.
-అంతే వేడి వేడి, ఘమఘమలాడే వెజిటబుల్ చపాతీ రెడీ. దీనికి ప్రత్యేకంగా కూర కూడా అవసరం లేదు. కేవలం పెరుగుతో గానీ, ఏదైనా ఊరగాయతో గానీ తింటే అద్భుతంగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్సులకు ఇది చాలా మంచి ఆప్షన్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications