Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
గొంతులో దిగుతుంటే స్వర్గమే..చలికాలానికి బెస్ట్ కడక్ మసాలా ఛాయ్..ఎలా చేసుకోవాలంటే..
బయట చలి గజగజా వణికిస్తోంది.. చల్లటి గాలులు శరీరాన్ని తాకుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో చేతిలో వేడివేడి టీ కప్పు ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ టీ మామూలుగా కాకుండా.. కాస్త ఘాటుగా, మసాలా దట్టించి, నోటికి రుచిగా తగులుతుంటే..స్వర్గమే అని చెప్పాలి.
టీ అనేది మన భారతీయులకు కేవలం పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. కానీ చాలామందికి స్ట్రాంగ్ మసాలా టీని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేయాలో తెలియదు. టీ పెట్టడం ఒక కళ. అందులో వేసే పాలు, నీళ్లు, టీ పొడి, మసాలాల నిష్పత్తి ఏమాత్రం తగ్గినా రుచి మారిపోతుంది. ఈ చలికాలంలో దగ్గు, జలుబు దరిచేరనివ్వకుండా, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే పర్ఫెక్ట్ కడక్ మసాలా ఛాయ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మసాలా టీ తయారీకి కావలసిన పదార్థాలు
-యాలకులు
-లవంగాలు
-నల్ల మిరియాలు
-దాల్చిన చెక్క
-జాజికాయ
-సోంపు
-ఎండిన గులాబీ రేకులు
-శొంఠి పొడి (ఎండిన అల్లం పొడి)
-పాలు
-నీరు
మసాలా టీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో యాలకలు, లవంగాలు, నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ, సోంపు వేసి కేవలం వేడి చేయాలి. అవి వేడెక్కి, వాటిలోని తేమ పోతే చాలు. రంగు మారేదాకా వేయించకూడదు.
-స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి మిశ్రమంలో ఎండిన గులాబీ రేకులను వేయండి. ఇవి చల్లారాక మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. చివరగా ఈ పొడిలో శొంఠి పొడిని కలపాలి. అంతే.. గుమగుమలాడే టీ మసాలా రెడీ. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
-ఇప్పుడు ఒక గిన్నెలో 4 కప్పుల నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు 4 టీస్పూన్ల టీ పొడి, మీ రుచికి సరిపడా పంచదార వేయాలి.
-టీ డికాక్షన్ బాగా మరుగుతున్నప్పుడు 2 కప్పుల పాలు పోయాలి. పాలు పోసిన తర్వాత మంటను హై ఫ్లేమ్ లో పెట్టి పొంగు రానివ్వాలి.
-టీ బాగా మరిగి చిక్కబడుతున్న సమయంలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని ముప్పావు టీస్పూన్ వేయాలి. మసాలా వేసిన తర్వాత టీని ఎక్కువ సేపు మరిగించకూడదు. కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మరిగించి, మసాలా వాసన టీకి పట్టగానే స్టవ్ ఆఫ్ చేయాలి.
-ఇప్పుడు టీని వడకట్టి, వేడివేడిగా కప్పుల్లో పోసి సర్వ్ చేయండి.ఈ మసాలా టీ గొంతులో దిగుతుంటే, అందులోని మిరియాల ఘాటు, యాలకుల సువాసన, శొంఠి వెచ్చదనం మీ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
