Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పాలకూర ఉల్లికారం..ఇలా చేసుకుంటే లొట్టలేసుకొని తింటారు
రోజూ ఒకరకమైన కూరలు తిని తిని బోర్ కొట్టిందా? కొత్తగా ఏదైనా టేస్టీ రెసీపీ ట్రై చేయాలనుకుంటున్నారా? పాలకూర ఉల్లికారంని చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు. కానీ ఈసారి ఢిఫరెంట్ గా ట్రై చేయండి..లొట్టలేసుకుంటూ తింటారు.
పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా ఇది అనేక రకాలుగా మేలు చేస్తుంది. అయితే ఈ పాలకూర ఉల్లికారం తయారీకి ఏయే పదార్థాలు కావాలి,తయారీ విధానం ఎలా వంటివి ఇక్కడ చూడండి.

పాలకూర ఉల్లికారం తయారీకి కావాల్సిన
పదార్థాలు
-వంట నూనె
-పాలకూర
-పసుపు
-జీలకర్ర
-కరివేపాకు
-ఉల్లిపాయలు
-వెల్లుల్లి
-శెనగపప్పు
-ఉప్పు
-తాలింపు గింజలు
-ధనియాలు
పాలకూర ఉల్లికారం తయారీ విధానం
-స్టవ్ మీద బాండీ పెట్టి అందులో రెండు చెంచాలా ఆయిల్ పోసి వేడి
చేయాలి.
-నూనె వెడెక్కాక అందులో రెండు లావుగా కోసుకున్న ఉల్లిగడ్డలు, పొట్టు
తీసిన ఒక వెల్లుల్లి గడ్డ, ఒక రెబ్బ కరివేపాకు,కొంచెం ధనియాలు, ఒక
చెంచా జీలకర్ర,ఒక చెంచా శెనగపప్పు వేసి కలర్ వచ్చేదాకా కలపండి.
-బాగా వేగిన ఆ మొత్తం మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన
పెట్టుకోండి
-ఇప్పుడు అదే బాండీలో మూడు చెంచాల నూనె పోసుకోవాలి.
-నూనె వేడెక్కాక అందులో తాలింపు గింజలతో పాటు రెండు ఎండు మిర్చి కూడా
వేసుకోవాలి. జీలకర్ర ఓ చెంచా వేసుకోవాలి.ఒక రెబ్బ కరివేపాకు వేయండి.
అందులోనే కొంచెం పసుపు వేయండి.
-వేగిన తర్వాత అందులో 5 కట్టల కట్ చేసి శుభ్రంగా కడిగిన పాలకూర
వేయండి. పాలకూర ఎలాంటి చీడ లేకుండా ఉండేది తీసుకోవాలి.
ఇప్పుడు ఆ బాండీ మీద మూతపెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. అప్పుడప్పుడు
మూత తీసి కలబెట్టుకోవాలి.
-ఇప్పుడు ముందుగా బౌల్ లో పక్కకు తీసి పెట్టిన మిశ్రమాన్ని మిక్సీలో
వేసుకొని మొత్తగా చేసుకోండి. అందులో ఒక చెంచా ఉప్పు,మూడు చెంచాల కారం
కూడా వేసుకోని మళ్లీ మిక్సీలో ఆడించండి. అది పేస్ట్ లా అయ్యాక తర్వాత
దాన్ని తీసి ఓ బౌల్ లో పెట్టుకోండి.
-5 నిమిషాలు పొయ్యి మీద పాలకూర బాగా మగ్గిన తర్వాత మిక్సీలో పట్టించిన
మిశ్రమాన్ని ఇందులో వేసుకొని కలపాలి. పాలకూరలోనే ఎక్కువశాతం ఉప్పు
ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం చూసుకొని ఉప్పు వేసుకోండి.
-నీళ్లు కూడా పొయ్యనవసరం లేదు కూరలో ఉండే వాటర్ సరిపోతుంది. బాగా
కలబెట్టుకోండి కొద్దిసేపు మూత పెట్టేయంది
-రెండు నిమిషాల తర్వాత మూత తీయండి.కమ్మటి పాలకూర ఉల్లికారం రెడీ
అయిపోతుంది.
-దీన్ని వేడి వేడి అన్నంలో తింటుంటే అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications