Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
పాలకోవా..ఈ స్వీట్ పేరు వింటేనే నోట్లో నీళ్లూరిపోతాయి. పండుగలు, శుభకార్యాలు, పుట్టినరోజులు ఇలా ఏ వేడుక వచ్చినా మన ఇళ్లలో స్వీట్స్ ఉండాల్సిందే. అందులో పాలకోవ ఉంటే ఆ ఆనందమే వేరు. నోట్లో పెట్టేకుంటే కరిగిపోయే అద్భుతమైన స్వీట్ ఇది. భారతీయ సంప్రదాయ స్వీట్లలో పాలకోవకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకమైనది. స్వీట్ షాపులో ఇది కనబడగానే తినేద్దామా అని మనసు లాగేస్తుంది. పాలకోవ కేవలం రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా మేలు చేస్తుంది. పాలు ప్రధాన పదార్థం కాబట్టి పాలలో ఉండే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి రకరకాల పాలకోవాలు లభిస్తాయి. వేటికదే ప్రత్యేకంగా ఉంటాయి. అయితే స్వీట్ షాపుకి వెళ్లే పని లేకుండా చాలా తక్కువ పదార్థాలతో కొద్ది సమయంలోనే అసలు సిసలైన టేస్టీ పాలకోవాని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
గ్యాస్, అసిడిటీకి తక్షణమే చెక్ పెట్టే అద్భుతమైన వాము పరాఠా.. ఎలా చేయాలో తెలుసా?
పాలకోవా తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆవు పాలు
-చక్కెర
-యలకల పొడి
పాలకోవా తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద లోతుగా, వెడల్పుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర లీటరు ఆవు పాలు పోసుకోండి. ఒక గరిటతో పాలను కలుపుతూ పెద్ద మంట మీద మరిగించాలి. అరగంట సేపటికి పాలు చిక్కబడి సగం కన్నా తక్కువ అయినప్పుడు అందులో నాలుగు చుక్కల నిమ్మరసం వేయండి.
-దాదాపు 40 నిమిషాలకు పాలు 250 ఎమ్ఎల్ అయిపోతాయి..అప్పుడు అందులో అరకప్పు చక్కెర వేసుకోండి. చక్కెర వేసిన తర్వాత అంచుల వెంట మీగడ కట్టకుండా గరిటతో జరుపుతూ ఉండండి.పాలు 200 ఎమ్ఎల్ అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి.
-45 నిమిషాలకు చక్కెర పూర్తిగా కరిగి లేత పాకం అవుతుంది. అప్పుడు అందులో అర టీస్పూన్ యాలకల పొడి వేసి కలిపి స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక ట్రేలో పోసి చల్లారనివ్వాలి. 2 గంటల తర్వాత అట్లకాడతో ఆ మిశ్రమాన్ని లాగితే పర్ఫెక్ట్ పాలకోవ రెడీ. దీనిపైన పిస్తా, బాదం ముక్కలను సన్నగా తరిగి వేసుకొని తింటుంటే ఆహా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications