Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..

Posted By:

మన జీవితాలను అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే మార్గదర్శకులు ఉపాధ్యాయులు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం'(టీచర్స్ డే) ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ ప్రత్యేకమైన రోజున గురువుల పట్ల మనకున్న ప్రేమను, గౌరవాన్ని వ్యక్తపరచడానికి ఒక తీయని బహుమతి ఇస్తే ఎంత బాగుంటుంది?

ఈ టీచర్స్ డే నాడు మీ లైఫ్ లో టీచర్స్ కోసం ఒక అద్భుతమైన స్వీట్ పనీర్ పాయసం తయారు చేసి వారిని ఆశ్చర్యపరచండి. దీనిని మ ఇంట్లో తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Paneer Payasam Recipe in Telugu Make Teachers Day Special Delicious Paneer Payasam for Your Gurus

పనీర్ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు

తురిమిన తాజా పనీర్ - 3/4 కప్పు
చక్కెర - అర కప్పు
పాలు - 3 కప్పులు
బాదం, పిస్తా - కొద్దిగా
యాలకుల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - ఒక చిన్న చిటికెడు
నెయ్యి - 1 టీస్పూన్

కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్‌ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..

పనీర్ పాయసం తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి అడుగు ఉన్న ఒక పాన్ పెట్టుకోండి. అందులో నెయ్యి వేసి మీడియం మంట మీద కరిగించండి.

-నెయ్యి వేడెక్కాక అందులో చక్కెర వేసి, మంటను మీడియంలో ఉంచి గరిటెతో కలుపుతూ ఉండండి. కొద్దిసేపటికి చక్కెర నెమ్మదిగా కరగడం ప్రారంభమై, లేత గోధుమ రంగులోకి మారుతుంది. చక్కెర పూర్తిగా కరిగి తేనె రంగులోకి వచ్చే వరకు కలపాలి. దీన్ని క్యారమెలైజేషన్ అంటారు. ఇది పాయసానికి అద్భుతమైన రుచిని ఇస్తుంది.

-ఇప్పుడు మంటను తగ్గించి, వేడి పాలను ఈ క్యారమెల్ మిశ్రమంలో చాలా జాగ్రత్తగా పోయాలి. పాలు పోయగానే క్యారమెల్ గట్టిపడినట్లు అనిపించినా, మరిగే కొద్దీ కరిగిపోతుంది.

-పాలు బాగా మరిగి నురుగు వచ్చే వరకు వేచి చూడండి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
తరువాత సువాసన కోసం యాలకుల పొడి, స్వీట్ రుచిని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి.

-ఇప్పుడు ముందుగా మెత్తగా తురిమి పెట్టుకున్న పనీర్‌ ను పాలలో వేయండి. గరిటెతో కలుపుతూ కేవలం 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించండి.

-ఈలోపు, మరో చిన్న కడాయిలో కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో బాదం, పిస్తా పప్పులను దోరగా వేయించండి. ఈ డ్రై ఫ్రూట్స్‌ ను పాయసంలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి.

-అంతే ఎంతో కమ్మగా ఉండే స్పెషల్ పనీర్ పాయసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, September 4, 2026, 16:54 [IST]
Desktop Bottom Promotion