Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
నోరూరించే క్రీమీ చీజ్ కార్న్..స్నాక్, సైడ్ డిష్,బ్రెడ్ తో ఎలా తిన్నా అద్భుతమే..ఈజీగా ఇలా చేసుకోండి
స్నాక్ గా లేదా సైడ్ డిష్ గా లేదా బ్రెడ్ తో కలిపి తినడానికి క్రీమీ చీజ్ కార్న్ అద్భుతంగా ఉంటుంది. ఇది చాలామంది ఇష్టపడే రుచికరమైన, సులభంగా తయారుచేసుకోగలిగే వంటకం. బ్యాచిలర్స్ కూడా తమ రూములో నిమిషాల్లో దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచికరంగా ఉండే దీన్ని ముఖ్యంగా పిల్లలు ఎంతగానో ఆస్వాదిస్తారు. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపించడం గ్యారెంటీ. క్రీమీ,చీజీ కార్న్ రెసిపి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-స్వీట్ కార్న్ గింజలు
-వెన్న (బటర్)
-మైదా పిండి
-పాలు
-చీజ్ తురుము
-ఉప్పు
-మిర్చి ఫ్లేక్స్
-ఒరెగానో
-కొత్తిమీర

తయారీ విధానం
-ఒక గిన్నెలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడ, స్వీట్ కార్న్ గింజలను అందులో వేసి 3-5 నిమిషాలు ఉడికించండి. అవి మృదువుగా మారిన తర్వాత, నీటిని వడగట్టి పక్కన పెట్టుకోండి. ఫ్రోజెన్ స్వీట్ కార్న్ వాడుతున్నట్లయితే ప్యాకెట్ పై ఉన్న సూచనల ప్రకారం ఉడికించుకోండి. సాధారణంగా వాటిని వేడి నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో వెన్న, కొద్దిగా వెల్లుల్లి తరుగు వేసి 10 సెకన్లు వేడి చెయ్యాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ మైదా వేసి బాగా కలపాలి. ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ 1-2 నిమిషాలు వేయించండి. పిండి రంగు మారకుండా, పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
-తర్వాత అందులో అరకప్పు పాలు నెమ్మదిగా పోస్తూ గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండండి. 2 నిమిషాలు మరిగించాలి. ఒకేసారి పాలు పోస్తే ఉండలు కట్టే అవకాశం ఉంది.
-తర్వాత ఉప్పు, పెప్పర్ పౌడర్, మిరప రేకులు(పిజ్జా,పాస్తాలలో కారం కోసం వేసే ఎండు మిరప పొడి), ఒరేగానో వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో స్వీట్ కార్న్ ఒక కప్పు, చీజ్ తురుము వేసి బాగా కలపాలి. చీజ్ కరిగే కొద్దీ సాస్ మరింత క్రీమీగా, రిచ్‌గా మారుతుంది. 2 నిమిషాలు కలుపుతూ ఉడికించాక స్టవ్ ఆపేయాలి. చివరగా కొద్దిగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయండి. అంతే క్రీమీ చీజీ కార్న్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications