Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు..ఎన్ని కూరలున్నా పక్కకు తోసేస్తారు..ఎలా చేసుకోవాలంటే
తెలుగువాళ్ల వంటల్లో పచ్చళ్లకు, తొక్కులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, పచ్చడి లేదా తొక్కు కలుపుకుని తింటే ఆ రుచి అద్భుతమే. అలాంటి సంప్రదాయ వంటకాల్లో పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు ఒకటి. దీనిని పచ్చిమిర్చి వెల్లుల్లి కారం అని కూడా పిలుస్తారు. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు, కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీని ఘాటుదనం, వెల్లుల్లి సువాసన, పుల్లని చింతపండు కలగలిసి ఒక అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఈ రుచికరమైన, సులభమైన తొక్కును ఎలా తయారు చేయాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.
పచ్చిమిర్చి వెల్లుల్లి కారం తయారీకి కావాల్సిన
పదార్థాలు
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి
-జీలకర్ర
-ఆవాలు
-చింతపండు
-ఆయిల్
-ఉప్పు
-కరివేపాకు
-ఇంగువ
-ఎండుమిర్చి

పచ్చిమిర్చి వెల్లుల్లి కారం తయారీ విధానం
-ముందుగా నిమ్మకాయ సైజు అంత చింతపండును వేడి నీళ్లల్లో నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీ పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేడి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 5-6 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేయండి. వీటిని కొంచెం దోరగా వేయించుకొని పక్కనపెట్టి చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో ఆ పచ్చిమిర్చిని వేసి ఇందులో రుచికి తగినట్లుగా ఉప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే పొట్టు తీసిన గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, వేడి నీళ్లలో నానబెట్టిన నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి కచ్చాపచ్చాగా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసి అందులో ఎండుమిర్చి,జీలకర్ర,ఆవాలు వేసి అవి చిటపటలాడే సమయంలో అందులో కొంచెం ఇంగువ, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి.
-ఈ తాళింపుని ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే పచ్చిమిర్చి వెల్లుల్లి కారం రెడీ.
-వేడి వేడి అన్నంలో కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు, నెయ్యి లేదా నువ్వుల నూనె వేసుకుని తింటే ఆ రుచిని మర్చిపోలేరు.
-ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగల్ వంటి అల్పాహారాలకు ఇది ఒక అద్భుతమైన సైడ్ డిష్‌గా పనిచేస్తుంది.
కొన్ని ప్రయోజనాలు ఇవే
పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు, జీలకర్ర ఈ పదార్థాలన్నీ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణ నష్టాన్ని నివారించి, దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పచ్చిమిర్చి-వెల్లుల్లి రెండింటిలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.. ఇవి శరీరంలో మంటను తగ్గించి ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో ఉపశమనం కలిగిస్తాయి. పచ్చిమిర్చి వెల్లుల్లి తొక్కు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ దానిని మితంగా తీసుకోవడం ముఖ్యం. ఎక్కువ కారం తినడం వల్ల కొంతమందికి కడుపు మంట ఎసిడిటీ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications