Latest Updates
-
మీ పిల్లలు హైట్ పెరగట్లేదా?.. ఈ మార్పులను ఒక్కసారి గమనించండి.! -
జూన్ 9: ఈ నాలుగు రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. కెరీర్లో ఊహించని మార్పులు! -
తాతల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. ఈ రెండూ కలిపి తింటే గ్యాస్ సమస్యలు పరార్.! -
పరమ ఏకాదశి 2026: ఈ రోజు ఉపవాసంతో మీ కష్టాలు తీరి రాజయోగం సిద్ధిస్తుందా? -
హనుమాన్ చాలీసా 40 చరణాల అర్థం తెలిస్తే మీరు మరింత భక్తితో పాడతారు -
టిఫిన్స్ లోకి కేరళ స్పెషల్ కొబ్బరి చట్నీ..రెండు తినే వారు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు! -
జూన్ 9 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు.. నేటి ప్రత్యేకతలు ఇవే! -
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా!
అన్నం,చపాతీ,పూరీలోకి పర్ఫెక్ట్..10 నిమిషాల్లో రుచికరమైన తోటకూర ఉల్లికారం..ఎలా చేసుకోవాలంటే
తోటకూర..ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆకుపచ్చని ఆరోగ్యం, అపారమైన పోషకాలు. భారతీయ వంటశాలలో తోటకూరది ఒక ప్రత్యేక స్థానం. దీనిని అనేక రకాలుగా వండుతారు. అందులో ఒక అద్భుతమైన, రుచికరమైన వంటకం తోటకూర ఉల్లికారం. ఇది కేవలం అన్నంలోకి మాత్రమే కాదు, రోటీ, చపాతీ, పూరీ వంటి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది. సాధారణంగా మనం తోటకూర పప్పు, తోటకూర వేపుడు చేస్తుంటాం. కానీ ఈ ఉల్లికారం రెసిపి చాలా సులభంగా, తక్కువ సమయంలో చేసుకోవచ్చు.
ఈ వంటకానికి కావాల్సిన పదార్థాలు కూడా చాలా సులభంగా దొరికేవే. ఉల్లిపాయల కారం, తోటకూర కలయిక ఈ కూరకి ఒక సరికొత్త రుచినిస్తుంది. బ్యాచిలర్లు కూడా చాలా సింపుల్ గా చేసుకోగలిగిన వంటకం. కేవలం 10 నిమిషాల్లో మీ ఇంట్లో తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తోటకూర ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-తోటకూర
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-తాలింపు గింజలు
-కారం
-ఉప్పు
-ఇంగువ
-కరివేపాకు
-టమాటో
-ఆయిల్
తోటకూర ఉల్లికారం తయారీ విధానం
-ముందుగా రెండు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు, 2 టీస్పూన్ల కారం వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 1 టీస్పూన్ తాలింపు గింజలు వేసి వేయించాలి.
-తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో చిటికెడు ఇంగువ, కరివేపాకు, మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం, 1 టమాటో ముక్కలు వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
-ఉల్లికారం వేగి,టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులో 2 కట్టల తోటకూరను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మీడియం మంట మీద బాగా కలుపుకోవాలి.
-మధ్య మధ్యలో కలుపుతూ 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి.
-తోటకూరలోని నీరు అంతా ఇగిరిపోయి ఆయిల్ పక్కకు వస్తున్నప్పుడు 1 నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే తోటకూర ఉల్లికారం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications