Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
మహారాష్ట్ర స్పెషల్..కుక్కర్ లో చిటికెలో తయారయ్యే కమ్మని మసాలా భాత్..లంచ్ బాక్స్ లోకి కేక
భారతీయ వంటకాల్లో బియ్యంతో చేసే రకరకాల వంటలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులోనూ మహారాష్ట్ర సంప్రదాయ వంటకమైన మసాలా భాత్ ఎంతో ప్రసిద్ధి చెందింది. మసాలా దినుసుల ఘాటు, కూరగాయల పోషకాలు, బియ్యం రుచి కలగలిపి చేసే ఈ వంటకం ఇప్పుడు తెలుగు వారి ఇళ్లలో కూడా బాగా ప్రాచుర్యం పొందుతోంది.
ముఖ్యంగా ఈ బిజీ లైఫ్ స్టైల్ లో తక్కువ సమయంలో, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఏదైనా వండుకోవాలి అంటే మసాలా భాత్ బెస్ట్ ఆప్షన్. బిర్యానీకి దగ్గరగా ఉన్నా, దీని రుచి తయారీ విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. మహారాష్ట్రలో దీనిని పెళ్లిళ్లు, పండుగల సమయంలో ప్రత్యేకంగా గోడా మసాలా అనే పొడిని వాడి తయారు చేస్తారు. మహారాష్ట్ర స్టైల్ మసాలా భాత్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-బియ్యం
-నీళ్లు
-నూనె
-నెయ్యి
-బంగాళాదుంప
-క్యారెట్
-కాలీఫ్లవర్
-పచ్చి బఠానీ
-ఉల్లిపాయ
-టమాటా
-ఆవాలు
-జీలకర్ర
-బిర్యానీ ఆకు
-లవంగాలు
-యాలకులు
-దాల్చిన చెక్క
-అల్లం-వెల్లుల్లి పేస్ట్
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-పసుపు
-కారం
-గోడా మసాలా
-ఉప్పు
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చెయ్యాలి.
-ఆయిల్,నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ అనాస, 5 లవంగాలు, 4 యాలకలు, 2 అంగుళాల దాల్చిన చెక్క వేసి వేయించాక ఇందులో అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి.
-వేగిన తాలింపులో రెండున్నర టేబుల్ స్పూన్ల పల్లీలు(వేరు శెనగపప్పు)వేసి చిట్లనివ్వాలి. తర్వాత అందులో అరకప్పు సన్నని ఉల్లిపాయ తరుగు వేసి అవి లేత బంగారు రంగులోకి వచ్చేదాకా వేయించాలి.
-ఉల్లిపాయలు రంగు మారాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించాక పావు కప్పు సన్నని క్యారెట్ ముక్కలు, అర కప్పు ఆలూ ముక్కలు, 10 కాలీఫ్లవర్ ముక్కలు, పావు టీస్పూన్ పసుపు వేసి కాలీఫ్లవర్ మీద కాలినట్లు మచ్చలు ఏర్పడేదాకా వేపాలి. దీనికి 4 నిమిషాల సమయం పడుతుంది.
-ఇప్పుడు 1 టమాటో తరుగు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒకటిన్నర టేబుల్ స్పూన్ల గోడా మసాలా(Goda Masala), అర టీస్పూన్ బిర్యానీ మసాలా, అరకప్పు ఫ్రోజన్ బఠాణీ, 4 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మెత్తం కలిపి వేగనివ్వాలి.
-2 నిమిషాలకు నూనె పైకి తేలుతున్నట్లు ఉన్న సమయంలో అందులో అరగంట సేపు నానబెట్టిన ఒకటిన్నర కప్పు బియ్యం, కొంచెం కొత్తిమీర తరుగు వేసి బియ్యంలోని చెమ్మ ఆరేదాకా వేయించాక 3 కప్పుల వేడి నీళ్లు, కావాలి అనిపిస్తే ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 2 విజిల్స్ పెద్ద మంట మీద 1 విజిల్ తక్కువ మంట మీద రానిచ్చి స్టవ్ ఆపేయాలి.
-అరగంట తర్వాత మూత తీసి చూడండి సూపర్ టేస్టీ మసాలా బాత్ రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications