Latest Updates
-
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఈ సంవత్సరం సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు కృష్ణ భక్తులు. ఈ పండుగ సందర్భంగా హిందువుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కన్నయ్యకు ఇష్టమైన రకరకాల పిండివంటలు, స్వీట్లు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.
ఈసారి ఆ నైవేద్యాల లిస్ట్ లో కృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అటుకులు, నువ్వులతో చేసే ఒక అద్భుతమైన స్వీట్ ను చేర్చండి. అదే అటుకులు నువ్వుల లడ్డూ. ఎంతో మృదువుగా, కమ్మగా ఉండే ఈ స్వీట్ ను కేవలం 10 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.

అటుకులు నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు
బ్రౌన్ షుగర్ (లేదా బెల్లం తురుము) - 3/4 కప్పు
నీళ్లు - 1 కప్పు
నెయ్యి - ఒకటింబావు టేబుల్ స్పూన్లు + 1 టేబుల్ స్పూన్ (విడిగా)
కొబ్బరి తురుము - 3/4 కప్పు
తెల్ల నువ్వులు - పావు కప్పు
అటుకులు - 1 కప్పు
వేయించిన పల్లీల పొడి (వేరుశెనగ పొడి) - పావు కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
అటుకులు నువ్వుల లడ్డు తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 3/4 కప్పు బ్రౌన్ షుగర్ లేదా బెల్లం తీసుకుని, దానికి 1 కప్పు నీళ్లు జతచేసి స్టవ్ మీద పెట్టండి. తీపి పూర్తిగా కరిగి నీళ్లలో కలిసేవరకు మరిగించి, ఆ ద్రావణాన్ని పక్కన పెట్టుకోండి. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, అందులో ఒకటింబావు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక కొబ్బరి తురుము వేసి, మంచి సువాసన వస్తూ బంగారు రంగులోకి మారే వరకు వేయించండి.
-అదే పాన్ లో పావు కప్పు తెల్ల నువ్వులు కూడా వేసి దోరగా వేయించండి. నువ్వులు చిటపటలాడి రంగు మారాక, ఆ కొబ్బరి-నువ్వుల మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే పాన్లో మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. అందులో 1 కప్పు అటుకులు వేసి, అవి బాగా క్రిస్పీగా అయ్యేవరకు సన్నని మంటపై వేయించండి.
-ఇప్పుడు ముందుగా కరిగించి పెట్టుకున్న తీపి నీటిని వడకట్టి, వేగుతున్న అటుకుల్లో పోసి బాగా కలపండి. మూతపెట్టి, అటుకులు ఆ నీటిని పూర్తిగా పీల్చుకుని మెత్తబడే వరకు ఉడికించండి.
-నీరంతా ఇగిరిపోయిన తర్వాత మూత తీసి, ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
-చివరగా అందులో పల్లీల పొడి, యాలకుల పొడి వేసి అన్ని పదార్థాలు కలిసేలా తిప్పండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి.
-చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, గోరువెచ్చగా ఉన్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా లడ్డూల్లా చుట్టుకోండి.
-అంతే అటుకులు నువ్వుల లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
