Latest Updates
-
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్న, పాలు, పెరుగుతో పాటు రకరకాల స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. కృష్ణుడికి పాలతో చేసిన వంటకాలంటే ఎంత ఇష్టమో, తన ప్రాణ మిత్రుడు కుచేలుడు ఇచ్చిన అటుకులు అన్నా అంతే ఇష్టం.
అందుకే ఈ కృష్ణాష్టమికి ఎప్పుడూ చేసే రొటీన్ పాయసానికి బదులుగా, కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన అటుకులు, పాలతో ఎంతో కమ్మని అటుకుల పాయసం ట్రై చేయండి. చాలా రుచిగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా క్రీమీగా ఉండే అటుకుల పాయసం మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

అటుకుల పాయసం తయారీకి కావలసిన పదార్థాలు
మందపాటి అటుకులు (ఎర్ర అటుకులు అయితే మంచిది) - 1 కప్పు
పెసరపప్పు - అర కప్పు
కాచి పెట్టుకున్న చిక్కటి పాలు - 1 లీటరు
తగినన్ని నీళ్లు
బెల్లం తురుము - 1 కప్పు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
యాలకులు - 3
జీడిపప్పు, ఎండు ద్రాక్ష - తగినంత
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
అటుకుల పాయసం తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కరిగాక, అటుకులను వేసి సన్నటి మంటపై కమ్మటి వాసన వచ్చేలా దోరగా వేయించి, ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అదే కడాయిలో అర కప్పు పెసరపప్పును కూడా వేసి, దోరగా బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించండి. వేయించిన పెసరపప్పును శుభ్రంగా కడిగి, ప్రెషర్ కుక్కర్ లో వేయండి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి, రెండు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించండి.
-కుక్కర్ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఉడికిన పెసరపప్పును కడాయిలోకి మార్చండి. అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను కూడా వేసి, స్టవ్ మీద పెట్టి సన్నని మంటపై బాగా కలపండి.
-ఇప్పుడు అందులో ముందుగా కాచి పెట్టుకున్న 1 లీటరు(4 కప్పులు) చిక్కటి పాలను పోయండి. దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపండి. మూతపెట్టి 5 నుంచి 8 నిమిషాల పాటు అటుకులు మెత్తబడే వరకు ఉడికించండి.
-అటుకులు మెత్తగా ఉడికి, పాయసం కాస్త చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు అందులో ఒక కప్పు బెల్లం తురుమును వేసి, బెల్లం పూర్తిగా కరిగేలా బాగా కలపండి. చివరగా, చిన్న పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి దోరగా వేయించండి. ఈ డ్రై ఫ్రూట్స్‌ను నెయ్యితో సహా పాయసంలో వేసి కలుపుకుంటే చాలు.
-అంతే అటుకుల పాయసం నైవేద్యానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
