Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
వర్షాల సమయంలో వేడివేడిగా..ప్రొటీన్ రిచ్ పుట్టగొడుగుల పులావ్..మెతుకు మిగల్చరు
నాన్ వెజ్ తిననివాళ్లు అయినా లేదా నాన్ వెజ్ తిననప్పడు గానీ మంచి ప్రొటీన్ తో టేస్టీ పులావ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మష్రూం పులావ్ ట్రై చేయండి. దీనిని పుట్టగొడుగుల పులావ్ అని కూడా అంటారు. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. గ్రేవీ కూడా అక్కర్లేదు.
కేవలం ఈ పులావ్ ని ఒట్టిగా అయినా లేదా రైతాతో అయినా తినవచ్చు. ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో,వాతావరణం చల్లగా ఉన్న సమయంలో వేడి వేడిగా దీన్ని చేసుకుని తింటే స్వర్గమే. మష్రూం పులావ్ తయారీకి కవాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మష్రూం
-అల్లం
-వెల్లుల్లి
-ఉల్లిపాయ
-దాల్చిన చెక్క
-బియ్యం
-ఉప్పు
-పుదీనా
-కొత్తిమీర
-పచ్చిమిరపకాయ
-పసుపు
-బిర్యానీ ఆకులు
-ఆయిల్
-నెయ్యి
-మిరియాలు
-జీలకర్ర
-లవంగాలు
-యాలకలు
-ధనియాల పొడి
-టమాటో
-జీడిపప్పు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 400గ్రాముల బటన్ మష్రూం వేసి ఇందులో 1 స్పూన్ గోదుమపిండి, కొంచెం నీళ్లు చిలకరించి చేతితో రబ్ చేస్తూ క్లీన్ చేయండి. తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి.
-రెండు మూడుసార్లు నీళ్లు పోసి కడిగితే మష్రూంలో ఉండే మట్టి లేదా దుమ్ము అంతా పోతుంది. క్లీన్ చేసిన మష్రూంని ముక్కలుగా కట్ చేసుకోండి.
-తర్వాత ఒక గిన్నెలో 400 గ్రాము బియ్యం(అన్నం వండుకునేవి లేదా బాస్మతి లేదా చిట్టిముత్యాలు అయినా)వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాక గిన్నె నిండుగా నీళ్లు అరగంటసేపు బియ్యాన్ని నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక ఇందులో 10 జీడిపప్పు పలుకులు, 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల తొక్క తీసేసిన వెల్లుల్లి, మధ్యలోకి కట్ చేసిన 10 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజులో కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు వేసి తక్కువ మంట మీద ఉల్లిపాయలు కాస్త మగ్గేవరకు గరిటతో కలుపుకుంటూ వేయించాలి.
-ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, 1 కప్పు కట్ చేసిన పుదీనా ఆకులు, కప్పు కట్ చేసుకున్న కొత్తిమీర వేసి 2 నిమిషాలు తక్కువ మంట మీద మగ్గించి స్టవ్ ఆపేసి వాటిని చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన మొత్తం వేసి,ఇందులోనే అరకప్పు కన్నా కొంచెం ఎక్కువ పెరుగు కూడా వేసి మొత్తాన్ని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు పులావ్ తయారీకోసం స్టవ్ మీద కుక్కర్ లేదా వెడల్పుగా ఉండే బిర్యానీ గిన్నె అయినా పెట్టి 5 టేబుల్ స్పూన్ల నెయ్యి,2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 టీస్పూన్ మిరియాలు, 1 టీస్పూన్ లైట్ గా క్రష్ గా చేసిన దాల్చిన చెక్క, లవంగాలు,యాలకల మిశ్రమం, 1 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి.
-మసాలాలన్నీ కొంచెం వేగాక అందులో కొంచెం కరివేపాకు, అరకప్పు పైనే ఉల్లిపాయ తరుగు, కొంచెం పసుపు వేసి వేయించాక ఇందులోనే సన్నగా స్లైసులుగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి ఇవి మెత్తగా అయ్యేదాకా వేయించాలి.
-తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకున్నాక కట్ చేసిన మష్రూం ముక్కలు ఇందులో వేసి కలిపి మూతపెట్టి 5-10 నిమిషాలు మూతపెట్టి మీడియం మంట మీద మగ్గించుకోవాలి.
-మష్రూం కాస్త ఉడికి గ్రేవీ ఊరి ఆయిల్ పైకి తేలిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసిన పేస్ట్ ను మష్రూంలో వేసి కలుపుతూ 3 నిమిషాలు మీడియం మంట మీద ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి.
-తర్వాత అందులో నానబెట్టుకున్న బియ్యంలోని నిళ్లు వంపేసి ఒట్టి రైస్ వేసి 5 నిమిషాలు తక్కు మంట మీద ఉడికించాలి.
-తర్వాత అందులో గ్లాసుల వేడి చేసిన నీళ్లను పోసి ఉప్పు చెక్ చేసి మూతపెట్టి నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. కుక్కర్ లో చేస్తుంటే..కాస్త ఎసరు నీళ్లు తగ్గించుకొని తక్కువ, మీడియం మంట మీద రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి.
-నీరు అంతా ఇగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాలు పక్క పెట్టుకోండి. తర్వాత మూత తీస్తే వేడి వేడి మష్రూం ఫులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













