Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
ఎగ్ ఫ్రై, గుడ్డు పులుసు పక్కన పెట్టండి..అద్భుతమైన ఎగ్ ఖీమా రుచి చూడండి..ఎలా చేసుకోవాలంటే
కోడిగుడ్డుతో రకరకాల వంటకాలు చేస్తుంటారు. అయితే మన ఇళ్లల్లో ఎక్కువగా ఎగ్ ఫ్రై లేదా ఉడకబెట్టిన ఎగ్స్ తో పులుసు వంటివి తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడూ ఎగ్ ఖీమా ట్రై చేశారా? అబ్బో రుచి అమోఘం అంతే. ఎగ్ ఖీమా రుచికరమైనదే కాకుండా పోషకమైన వంటకం కూడా. గుడ్లు, ఇతర కూరగాయల కలయిక వల్ల ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీ మళ్లీ కావాలని మీ నాలుక మిమ్మల్ని అడగడం ఖాయం. ఇది అన్నం, రోటీ, చపాతీ, లేదా పూరీలతో తినడానికి అద్భుతంగా ఉంటుంది. సులభంగా తయారుచేయగలిగే ఈ వంటకం అల్పాహారం, మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి పర్ఫెక్ట్ ఛాయిస్. ఎగ్ ఖీమా రెసిపిని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.
ఎగ్ ఖీమా తయారీకి కావాల్సిన పదార్థాలు
-కోడిగుడ్లు: 6-8
-నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-జీలకర్ర: 1/2 టీస్పూన్
-కరివేపాకు: కొన్ని రెబ్బలు
-పసుపు: 1/2 టీస్పూన్
-కారం: 1 టీస్పూన్
-ధనియాల పొడి: 1 టీస్పూన్
-జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
-గరం మసాలా: 1/2 టీస్పూన్
-ఉప్పు: రుచికి సరిపడా
-ఉల్లిపాయలు: 2
-టమాటాలు: 2
-పచ్చిమిర్చి: 2-3
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-నీళ్లు: 1 కప్పు
-కొత్తిమీర: కొద్దిగా
ఎగ్ ఖీమా తయారీ విధానం
-ముందుగా గుడ్లను గట్టిగా ఉడికించుకోవాలి. ఉడికిన గుడ్ల పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
-చల్లారిన తర్వాత ఉడికించిన గుడ్లను గ్రేటర్ ఉపయోగించి తురుముకోండి లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనిచ్చాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేయించండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు బాగా వేయించండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు తరిగిన టమాటాలను వేసి టమాటాలు మెత్తగా అయ్యే వరకు,నూనె పైకి తేలే దాకా ఉడికించండి. కొద్దిగా ఉప్పు వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి.
-టమాటా ముక్కలు బాగా ఉడికిన తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. మసాలాలు మాడిపోకుండా తక్కువ మంటపై 1-2 నిమిషాలు వేయించండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి మసాలాలను వేయించుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-ఇప్పుడు నీళ్లు పోసి గ్రేవీ చిక్కదనం కోసం బాగా కలపండి. మీకు ఎంత చిక్కని గ్రేవీ కావాలంటే అంత నీళ్లు పోసుకోవచ్చు. గ్రేవీని 5-7 నిమిషాల పాటు బాగా ఉడికించి నూనె పైకి తేలే వరకు మూత పెట్టి సిమ్ లో ఉంచండి.
-గ్రేవీ బాగా ఉడికిన తర్వాత తురిమిన గుడ్లను ఇందులో వేసి మెల్లగా కలపండి. గుడ్లు విడిపోకుండా జాగ్రత్తగా కలపండి. 2-3 నిమిషాల పాటు గుడ్లు గ్రేవీతో కలిసిపోయేలా ఉడికించండి.
-చివరగా గరం మసాలా వేసి బాగా కలపండి. స్టవ్ ఆపేసి సన్నగా తరిగిన కొత్తిమీర అందులో చల్లుకోండి. అంతే టేస్టీ ఎగ్ ఖీమా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






