Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
ఇడ్లీ, దోశ పక్కన పెట్టేయండి..బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..100 ఏళ్లు బతుకుతారు!
రాగి..చిరుధాన్యాలలో ఒకటి. ఇందులో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రాగులతో చేసే ఆవిరి కుడుములు పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో తీనడానికి బెస్ట్ ఛాయిస్. రాగి ఆవిరి కుడుములు తయారు చేయడం సులభం. రాగి కుడుములు అద్భుతమైన పోషక విలువలు, సులభమైన జీర్ణక్రియ, అధిక కాల్షియం ఐరన్ కంటెంట్ కారణంగా సంప్రదాయ, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎంపికగా నిలుస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ కుడుములు పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ చాలా మంచిది. చుక్క ఆయిల్ లేకుండా రాగి కుడుములు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
రాగి కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగిపిండి
-ఆవాలు
-జీలకర్ర
-పొట్టు మినపప్పు
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-పచ్చిమిరపకాయలు
-ఆయిల్
-ఉప్పు
-పచ్చి శెనగపప్పు

రాగి కుడుములు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పు, పొట్టు మినపప్పు వేసి ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసి 1 ఇంచు అల్లం సన్నని తరుగు, 1 చిన్న ఉల్లిపాయ సన్నని తరుగు, 2 పచ్చిమిరపకాయల సన్నని ముక్కలు వేసి 30 సెకన్ల పాటు ఫ్రై చేసుకోవాలి.
-తర్వాత అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోవాలి,రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి నీటిని 1 మరుగు వచ్చేదాకా మరిగించుకోవాలి.
-నీరు మరుగుతున్నప్పుడు అందులో ఒకటిన్నర కప్పు రాగిపిండి వేసుకోవాలి.మంటను తక్కువలో ఉంచి పిండిమొత్తం ఆ నీటిలో కలిసేలా బాగా కలుపుకోవాలి.
-తర్వాత అందులో కొంచెం కొత్తిమీర తరుగు కూడా చల్లుకొని పిండిలో అది కూడా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆపేసి కలిపిన పిండిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా చేతుల్లోకి తీసుకొని బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి.
-తర్వాత ఇడ్లీ పాత్రలోని ప్లేట్లలోని గుంటలకి ఆయిల్ లేదా నెయ్యి అప్లయ్ చేసుకొని వాటిలో వత్తుకున్న బాల్స్ ను ఉంచండి.
-ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో కొన్ని నీళ్లు పోసి మరగడానికి దగ్గరకి వచ్చాక ఉండలు పెట్టి ఉంచిన ఇడ్లీ ప్లేట్లను పాత్రలో సెట్ చేసుకొని మూతపెట్టి 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆప్ చేసేసి ప్లేట్ ను బయటకు తీసి చల్లారనిచ్చి ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ రాగి కుడుములు రెడీ. వీటని పల్లీ చట్నీతో తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
