Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పప్పుచారులో నంజుకొని తినడానికి ఇదే సరైనది..పచ్చి అరటికాయతో ఫ్రై ఇలా చేసుకోండి
తెలుగువారి ఇళ్లల్లో తరచుగా చేసుకునే వంటకాల్లో బనానా ఫ్రై ఒకటి. దీనిని అరటికాయ వేపుడు అని కూడా అంటారు. అన్నంలోకి పప్పు, సాంబార్, మజ్జిగచారుతో నంజుకొని తినడానికి ఇది అద్భుతమైన సైడ్ డిష్. దీన్ని తయారు చేయడం సులభం. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. పచ్చి అరటికాయలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు చాలా ముఖ్యం. మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది, తద్వారా అనవసరంగా ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఆపుతుంది. క్రంచీగా,టేస్టీగా బనానా ఫ్రై ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
బనానా ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి అరటికాయ
-ఆయిల్
-పోపు దినుసులు
-జీలకర్ర
-వెల్లుల్లి
-కారం
-ఉప్పు
-కారం
-ఎండుమిర్చి
-కరివేపాకు

బనానా ఫ్రై తయారీ విధానం
-ముందుగా ఒక కూర అరటికాయ(పచ్చి అరటికాయ) తీసుకొని దాని తొక్కు తీసేసి నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోండి.
-అరటికాయ ముక్కలను కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేయడం వల్ల అవి నల్లబడకుండా ఉంటాయి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో టీస్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక పోపు దినుసులు, రెండు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాక ఇందులోనే కట్ చేసిన అరటికాయ ముక్కలు వేసి పావు టీస్పూన్ పసుపు వేసి మగ్గనివ్వాలి. వేపుడు కరకరలాడుతూ రావాలంటే ముక్కలను నూనెలో తక్కువ మంటపై నిదానంగా వేయించాలి.
-అరటికాయ ముక్కలు మగ్గేలోగా మిక్సీ జార్ లో 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఉప్పు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
-అరటికాయ ముక్కలు బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక అందులో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసి ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే క్రిస్పీ బనానా ఫ్రై రెడీ. తాజా కరివేపాకు, కొత్తిమీర వాడటం వల్ల వేపుడుకు మంచి సువాసన, అదనపు రుచి వస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications