Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీ..టేస్ట్ లో తిరుగుండదు అంతే..ఎలా చేసుకోవాలంటే..
రాయలసీమలోని చాలా పల్లెల్లో స్పెషల్ గా చేసే వంటకం బెండకాయ బజ్జీ. దీనిని కొందరు పుల్లకూర, ముద్దకూర అని కూడా అంటారు. తమిళనాడులో కూడా చాలా చోట్ల దీనిని బజ్జీ అని అంటారు. ఇది చాలా రుచికరంగా ఉండే కూర. టేస్ట్ చేశారంటే జన్మలో మర్చిపోలేరు. ముఖ్యంగా రాగి సంగటి లేదా జొన్న సంగటిలో ఇది కలుపుకుని తింటే తిరుగుండదు. రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీని మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
రాయలసీమ స్పెషల్ బెండకాయ బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు
-బెండకాయలు
-ఉల్లిపాయ
-పుల్లటి నాటు టమాటోలు
-పుసుపు
-కల్లు ఉప్పు
-చింతపండు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-ఆవాలు
-కరివేపాకు

బెండకాయ బజ్జీ తయారీ విధానం
-ముందుగా 300 గ్రాముల బెండకాయలను శుభ్రంగా కడిగి కట్ చేశాక ఆరబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె లేదా బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 10 వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి రంగు మారుతున్న సమయంలో ఇందులో రెండు ఉల్లిపాయల పెద్ద ముక్కలు వేసి 1నిమిషం వేపితే చాలు.
-తర్వాత అందులో రెండు పుల్లటి నాటు టమాటోల ముక్కలు, కొద్దిగా పసుపు, కల్లు ఉప్పు వేసి 3-4నిమిషాలు వేపుకున్నాక ఇందులో తుడిచి ఆరబెట్టిన బెండకాయ ముక్కలను వేసి మూతపెట్టి హై ఫ్లేమ్ మీద బెండకాయల్లో నుంచి జిగురు తగ్గేదాకా వేపుకోవాలి. దీనికి 3-4 నిమిషాలు పడుతుంది.
కూరగాయలే అవసరం లేని రాయలసీమ స్పెషల్ ఎండుమిర్చి పప్పు..నాకి నాకి తింటారు, ఎలా చేసుకోవాలో చూడండి
-తర్వాత అందులో 8 కారం కలిగిన పచ్చిమిర్చి ముక్కలు, 50 గ్రాముల చింతపండు వేసి కలిపి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
-తర్వాత అందులో 300 ml నీళ్లు పోసి మూతపెట్టి గుజ్జుగా అయ్యేదాకా ఉడకనివ్వాలి.
-బెండకాయ మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుంచి పప్పు గుత్తితో దానిని సాధ్యమైనంత మేరకు గుజ్జుగా ఇనుపుకోండి. ఇనిపేటప్పుడు అది కాస్త నీరు నీరులానే ఉండాలని గుర్తుంచుకోండి.
-తర్వాత తాళింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి అందులో అర టీస్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి కలిపి వేగాక ఈ తాళింపుని బెండకాయ గుజ్జులో వేసి కలిపేయండి. అంతే బెండకాయ బజ్జి లేదా బెండకాయ పుల్లకూర రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
