Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం..అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా, ఎలా చేయాలంటే
రాయలసీమ పేరు వినగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది అక్కడి స్పైసీ రుచులు, అక్కడివాళ్ల మర్యాద. రాయలసీమ పేరుతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రెస్టారెంట్లు వెలిసాయి..వాటిల్లో సీమ స్పెషల్ వంటకాలను అందిస్తున్నారు. రాయలసీమ వంటకాలలో ఎల్లిపాయ కారం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఎల్లిపాయ, కారం, ఉప్పు కలయికతో తయారయ్యే ఈ కారం రుచిలో ఘాటుగా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని అన్నం, ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఈ కారం ఆరోగ్యానికి కూడా అనేక రకాలుగా మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపర్చడంలో,రోగనిరోధక శక్తిని పెంచడంలో,గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో,క్యాన్సర్ నివారణలో,మధుమేహాన్ని నియంత్రణలో ఇలా అనేక రకాలుగా మేలు చేసే ఎల్లిపాయ కారం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

రాయలసీమ ఎల్లిపాయ కారం తయారీకి కావాలసిన పదార్థాలు
ఎల్లిపాయలు: 1 కప్పు
ఎండు మిరపకాయలు: 1/2 కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 టీస్పూన్
ఆవాలు: 1/2 టీస్పూన్
కరివేపాకు: కొద్దిగా
అద్భుతమైన పౌష్ఠికాహారం ఇదే..డయాబెటిస్ ఉన్నోళ్లు కూడా తినొచ్చు,జొన్న ఖిచిడి ఎలా చేయాలంటే
తయారీ విధానం
-ముందుగా ఎల్లిపాయలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత ఎండు మిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.
-ఆయిల్ వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
-తర్వాత అందులో ఎల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించిన తర్వాత ఎండు మిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-అవసరమైతే కొద్దిగా నూనె వేసి మళ్లీ గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే ఎల్లిపాయ కారం రెడీ. ఈ కారాన్ని వివిధ రకాల కూరల్లో కూడా ఉపయోగించవచ్చు. ఎల్లిపాయ కారాన్ని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవడానికి, గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు.
-ఎల్లిపాయ కారంలో కొద్దిగా చింతపండు గుజ్జు కలిపితే, పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications