Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చపాతీ, పూరీలలోకి అదిరిపోయే సైడ్ డిష్ ..హోటల్ స్టైల్ చన్నా కుర్మా ఇంట్లోనే
ప్రతిరోజూ ఇంట్లో చేసే చపాతీలు, పూరీలలోకి ఎప్పుడూ ఒకే రకమైన కూరలు చేసి విసిగిపోయారా? మీ కుటుంబ సభ్యులు ఈసారి ఏదైనా కొత్తగా, ప్రత్యేకంగా చేయమని అడుగుతున్నారా? అయితే, ఈసారి వారిని ఆశ్చర్యపరిచేలా చన్నా కుర్మా ప్రయత్నించండి.
చన్నా కుర్మాని చపాతీ, పూరీలతోనే కాదు, వేడివేడి అన్నం, జీరా రైస్, లేదా దోసెలతో తిన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది. రుచికరమైన చన్నా కుర్మా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
తెల్ల శనగలు - ముప్పావు కప్పు
బంగాళాదుంపలు - 3
పెద్ద ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము - ఒక చిన్న చిప్ప
జీడిపప్పు - 7-8
సోంపు - అర టీస్పూన్
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
లవంగాలు - 2
యాలకులు - 2
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
పసుపు - పావు టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మేథి - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా 8 గంటలపాటు నానబెట్టిన శనగలను శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్ లో వేయండి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, బంగాళాదుంపలు వేసి నీరు పోసి మూతపెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
-ఆవిరి పోయాక కుక్కర్ మూత తీసి బంగాళాదుంపలను తీసి తొక్క వలిచి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి తురుము, జీడిపప్పు, సోంపు వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడి చేశాక ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కల్పాసి, జీలకర్ర, సోంపు వేసి చిటపటలాడనివ్వండి.
-ఇప్పుడు కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, టమోటా ముక్కలు వేయండి. టమోటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా మారే వరకు మగ్గించాలి.
-ఇప్పుడు మంటను తగ్గించి అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న శనగలను, ఆ నీటితో సహా కడాయిలో పోయాలి. ఉడికించిన బంగాళాదుంప ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. తర్వాత గ్రైండ్ చేసిన కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ను వేసి గ్రేవీకి కావలసినన్ని వేడినీళ్ళు పోసుకోండి.
-ఇప్పుడు అందులో గరం మసాలా,నలిపిన కసూరి మేథి వేసి బాగా కలిపి మూతపెట్టి 5-7 నిమిషాల పాటు నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే ఘుమఘుమలాడే హోటల్ స్టైల్ చన్నా కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
