Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
రెస్టారెంట్ స్టైల్ మసాలా టీ..ఇంట్లోనే ఇలా పెట్టారంటే ఆ రుచి జన్మలో మర్చిపోరు!
పొద్దున్నే నిద్ర లేవగానే చాలామందికి వేడివేడిగా ఒక కప్పు టీ పడితేనే గానీ ప్రాణం లేచి రాదు. ఇక అలసటగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా మనకి గుర్తొచ్చే ఏకైక ఔషధం టీ. అయితే చాలా ఇళ్లలో ఒక అపోహ ఉంది. అదేంటంటే.. టీలో కాస్త అల్లం ముక్క, రెండు ఏలకులు దంచి వేస్తే చాలు..టీ ఆటోమేటిక్ గా అద్భుతంగా మారిపోతుందని నమ్ముతారు. కానీ, వాస్తవం వేరు.
అన్ని రకాల మసాలా దినుసులు వేసినా కూడా ఆఖరికి టీ కప్పు నోటి దగ్గరకు వచ్చేసరికి అది చప్పగానో, మరీ చేదుగానో లేదా రుచి పచి లేకుండా నీళ్లలానో అనిపిస్తుంది. ఇది కేవలం మసాలా దినుసుల లోపం కాదు, మనం టీ తయారుచేసే పద్ధతిలో ఉన్న లోపం. చిన్న చిన్న తప్పులే టీ రుచిని పాడుచేస్తాయి.

మీరు బయట రెస్టారెంట్లలో, ధాబాల్లో తాగే టీ లాగా చిక్కగా, ఘాటుగా, సుగంధభరితంగా మీ ఇంట్లోని టీ కూడా ఉండాలని కోరుకుంటున్నారా? రెస్టారెంట్ స్టైల్ లో టీ మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
నీళ్లు: ఒకటిన్నర కప్పు
పాలు: రెండు కప్పులు (చిక్కటివి)
టీ పొడి: రెండు టీస్పూన్లు
చక్కెర: రెండు టీస్పూన్లు
ఏలకులు: 2
అల్లం: ఒక చిన్న ముక్క
లవంగాలు: 5
దాల్చిన చెక్క: ఒక అంగుళం ముక్క
బిర్యానీ ఆకు: 1
తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక లోతైన గిన్నెను పెట్టండి. అందులో రెండు టీస్పూన్ల చక్కెర, కేవలం ఒక టీస్పూన్ నీరు వేయండి. మంటను తక్కువలో ఉంచి చక్కెరను కరగనివ్వండి. చక్కెర రంగు మారి బ్రౌన్ కలర్ (కారామెలైజ్) వచ్చే వరకు వేచి ఉండండి.
-చక్కెర బ్రౌన్ కలర్ లోకి మారిన తర్వాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి వాటిని బాగా మరగనివ్వాలి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు.. ఏలకులు, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకును (వీటిని వేసే ముందు కాస్త దంచండి లేదా పొడిగా ఉండేలా చూసుకోండి) వేడి నీటిలో వేయండి. ఈ మసాలా దినుసుల సారం నీటిలోకి దిగేలా కాసేపు మరిగించాలి.
-మసాలా దినుసులు నీటిలో బాగా ఉడికి, మంచి వాసన వస్తున్నప్పుడు రెండు టీస్పూన్ల టీ పొడిని వేయండి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించాలి.
-మీరు పోసిన ఒకటిన్నర కప్పు నీళ్లు ఇగిరిపోయి, సుమారు అర కప్పు డికాక్షన్ లా మిగిలేంత వరకు మరిగించాలి. ఇలా చేయడం వల్ల టీ చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది.
-నీరు తగ్గిన తర్వాత అందులో రెండు కప్పుల చిక్కటి పాలను పోసి మంటను సిమ్ లో ఉంచండి. చిన్న మంటపై టీని నిదానంగా మరిగించాలి.
-పాలు, డికాక్షన్, మసాలాలు అన్నీ కలిసిపోయి టీ చిక్కబడే వరకు మరిగించండి. టీ రంగు మారి, మంచి సువాసన ఇల్లంతా వ్యాపిస్తున్నప్పుడు స్టవ్ ఆపివేయండి.
-అంతే వేడి వేడి మసాలా కడక్ చాయ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications