Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
రెస్టారెంట్ స్టైల్ రుమాలి రోటీ..మెత్తగా,నోట్లో కరిగిపోయేలా..ఎలా చేసుకోవాలంటే
భారతీయ వంటకాల్లో కొన్ని వంటకాలు వాటి రుచి, సున్నితత్వం, తయారీ విధానం వల్ల ప్రత్యేకంగా నిలుస్తాయి. రుమాలీ రోటీ అటువంటి వాటిల్లో ఒకటి. పేరుకు తగ్గట్టే, రుమాలు లాగా సన్నగా, మృదువుగా ఉండే ఈ రోటీ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, రాజస్తాన్ లో ఈ రోటీని నాన్ వెజ్ కూరలు, ముఖ్యంగా కబాబ్ లు, తందూరీ వంటకాలతో కలిపి తింటారు. సాధారణంగా మన ఇంట్లో చేసుకునే రోటీలకన్నా రెస్టారెంట్ లో చేసే రుమాలీ రోటీలే బాగుంటాయి అని చాలామంది అనుకుంటారు.
రెస్టారెంట్ కి మించిన టేస్ట్ తో అదిరిపోయే మెత్తని రుమాలీ రోటీని మీ ఇంట్లోనే ఈజీగా చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన వస్తువులు అవసరం లేదు, కానీ పిండిని సరిగ్గా కలపడం,రోటీని సన్నగా చేయడం ముఖ్యం. రెస్టారెంట్ స్టైల్ రుమాలీ రోటీని ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
రుమాలీ రోటీ తయారీకి కావలసిన పదార్థాలు
-మైదా పిండి
-ఉప్పు
-నూనె/నెయ్యి
-నీళ్ళు
తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోండి.
-ఓ చిన్న కప్పులో రుచికి సరిపడా ఉప్పు, అర చెంచా చక్కెర వేసి ,కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మైదాపిండిలో వేసి బాగా కలుపుకోండి.
-ఇప్పుడు మైదా మిశ్రమంలోనే తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగ,జిగురుగా ఉండేలా ఒత్తుకోండి.
-అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి కనీసం 5-6 నిమిషాలు ఒత్తుకోండి.
-మళ్లీ 1 టీస్పూన్ ఆయిల్ వేసి జిగురు జిగురుగా ఒత్తుకోండి. ఆయిల్ వేసి ఎక్కువసేపు ఒత్తుకోవడం వల్ల రోటీలు చేసేటప్పుడు పిండి చాలా మెత్తగా సాగుతుంది.
-ఈ మిశ్రమం చపాతీ పిండి కంటే కూడా చాలా చాలా మెత్తగా ఉండాలని గుర్తుంచుకోండి.
-ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకోండి.
-ఓ ప్లేట్ మీద కాస్త పొడి మైదా పిండి చల్లుకొని దాని మీద పిండి బాల్స్ ను పెట్టి పైన కాస్త ఆయిల్ తో తడిచేసి వాటన్నింటిమీద ఒక తడిగుడ్డ కప్పి కనీసం అరగంట సేపు అలా వదిలేయాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ ఐరన్ బాండీని బోర్లించి పెట్టి మంటను ఎక్కువలో ఉంచండి.
-ఇప్పుడు ఓ చిన్న కప్పులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర కప్పు నీళ్లు పోసి ఉప్పును కరిగించి ఈ నీళ్లను వేడి వేడి బాండీ మీద చల్లుకోండి.
-ఇప్పుడు ప్లోర్ మీద మైదాపిండి చల్లుకొని పిండి బాల్స్ ను అప్పడాల కర్రతో వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి.
-ఆ తర్వాత రెండు చేతుల్లోకి మార్చుకుంటూ మార్చుకుంటూ పల్చటి కర్చీఫ్ లా చేసుకోండి.
-ఇప్పుుడు దీన్ని స్టవ్ మీద బోర్లించి ఉన్న బాండీమీద వేయండి. తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోండి. తర్వాత కర్ఛీఫ్ లా మడతబెట్టుకోండి. అంతే రుమాలీ రోటీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








