Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
చపాతీ, పూరీ దేనిలోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్..టేస్టీ బఠానీ కుర్మా..చికెన్, మటన్ గ్రేవీలైనా దీని ముందు దిగదుడుపే!
పూరీ, చపాతీల్లోకి ఎప్పుడూ ఒకే రకమైన సైడ్ డిష్ తినడం మీకు బోర్ కొడుతోందా? కాస్త విభిన్నమైన రుచితో, నాన్ వెజ్ కుర్మాను సైతం మరిపించేలా ఉండే అద్భుతమైన వెజిటేరియన్ కుర్మా చేయాలనుకుంటున్నారా? అయితే హోటల్ స్టైల్ బఠానీ కుర్మా ట్రై చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. బఠానీలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. బఠానీ కుర్మా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
పచ్చి బఠానీలు - 1 కప్పు
ఉల్లిపాయలు - 2 పెద్దవి
టమాటాలు - 2
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - అర టీస్పూన్
గరం మసాలా పొడి - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
లవంగాలు - 2
యాలకులు - 1
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
ఉప్పు - రుచికి తగినంత
నీళ్లు - గ్రేవీకి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ లేదా కడాయి పెట్టుకుని అందులో నూనె వేడి చేయండి.
-నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క
వేసి ఒక నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత జీలకర్ర కూడా వేసి
చిటపటలాడనివ్వండి.
ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత
బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా బాగా కలుపుతూ వేయించండి. ఆ తర్వాత అందులో తరిగిన టమాటా ముక్కలు వేసి, అవి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు ఉడికించండి.
-టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, కారం, గరం మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలన్నీ బాగా కలిసేలా రెండు నిమిషాల పాటు వేయించండి.
-ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి ముందుగా మెత్తగా రుబ్బుకోవాలి. దీనిలోనే గుప్పెడు పచ్చి బఠానీలు, కొంచెం నీళ్లు పోసి మృదువైన పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి-బఠానీ పేస్ట్ ను పాన్ లో వేసి పచ్చి వాసన పోయేలా సుమారు 3 నిమిషాల పాటు నూనెలో వేయించండి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు మిగిలిన పచ్చి బఠానీలను వేసి బాగా కలపండి. పాన్ పై మూతపెట్టి సన్నని మంట మీద 7 నుండి 8 నిమిషాల పాటు ఉడికించండి.
-బఠానీలు మెత్తగా ఉడికి, నూనె పైకి తేలుతున్నప్పుడు ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లుకుని బాగా కలుపుకుంటే.. ఘుమఘుమలాడే వేడివేడి బఠానీ కుర్మా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications