రాయల్‌ వీకెండ్‌.. ఈ స్పెషల్‌ మసాలాతో మొఘల్‌ కిచెన్‌ రెసిపీ మహారాణి చికెన్‌ కర్రీ.!

వీకెండ్‌ వచ్చిందంటే నాన్‌వెజ్‌ ప్రియులు స్పెషల్‌ ఏంటని ఎదురుచూడటం ప్రతి ఇంట్లో కామన్‌. ఈ సారి మీ ఇంట్లో చికెన్‌ వెరైటీలు ఎప్పటిలా కాకుండా ఇంట్లోనే రెస్టారెంట్‌ టేస్ట్‌ను తలపించేలా ఈ మొఘలాయ్‌ స్టైల్‌ మహారాణి చికెన్‌ కర్రీని ట్రై చేయండి. క్రీమీక్రీమీగా ఉంటూ చూడగానే, వాసనకే కడుపు నిండేలా ఈ స్పెషల్‌ డిష్‌ను తప్పక ట్రై చేయాల్సిందే.. మహారాణి చికెన్‌ కర్రీని ఎలా చేయాలో చూద్దాం..

Royal weekend mughlai kitchen recipe maharani chicken curry with this special masala

చికెన్‌ను మ్యారినేట్‌ చేసుకోవడం కోసం కావాల్సిన పదార్థాలు..

చికెన్‌- అరకిలో(రెండు లేదా మూడు లెగ్‌ పీస్‌లు ఉండేలా చూసుకోండి)
ఉప్పు- టీస్పూన్‌
మిరియాల పొడి- టీస్పూన్‌
నిమ్మరసం- టీస్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
పెరుగు- రెండు టేబుల్‌ స్పూన్లు

మహారాణి చికెన్‌ కర్రీలో మసాలా కోసం కావాల్సిన పదార్థాలు

బాదం పప్పులు- పదిహేను
జీడిపప్పులు- పదిహేను
ధనియాలు- రెండు టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర- టీస్పూన్‌
ఎండి మిర్చి- మూడు
మసాలా దినుసులు- టీస్పూన్‌
కసూరి మెంతి- రెండు టీస్పూన్లు

మహారాణి చికెన్‌ కర్రీకి కావాల్సిన పదార్థాలు

నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయలు- ఏడు
పెరుగు- అరకప్పు(గడ్డలు లేకుండా చిలికిన పెరుగు)
ఫ్రెష్‌ క్రీమ్‌- అరకప్పు

మహారాణి చికెన్‌ కర్రీ తయారీ విధానం

ముందుగా చికెన్‌ను మ్యారినేట్‌ చేసుకోవాలి. ఇందుకోసం చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక వెడల్పాటి బౌల్‌లో తీసుకోవాలి. అందులో ఉప్పు, మిరియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, నిమ్మరసం, పెరుగు వేసి కలిపి 20 నిమిషాల పాటు మ్యారినేట్‌ చేసుకోవాలి.

Royal weekend mughlai kitchen recipe maharani chicken curry with this special masala

ఈలోపు మసాలా పౌడర్‌ సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్‌పైన పాన్‌ పెట్టి బాదం, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మసాలా దినుసులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కసూరి మెంతి వేసి కాసేపు వేయించాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌గా చేసుకోవాలి.

పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

ఇప్పుడు స్టవ్‌పైన అదే పాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలను పొడవుగా సన్నగా కట్‌ చేసుకుని రంగు మారే వరకు వేయించాలి. వేగిన తర్వాత మ్యారినేట్‌ చేసిన చికెన్‌ వేసి ఉడికించాలి. చికెన్‌లో నీళ్లు ఊరి ఆ నీరు ఇంకిపోయేవరకు మీడియం మంటపైన ఉడికించాలి.

చికెన్‌ దగ్గరగా ఉడికిన తర్వాత అందులో అరకప్పు గడ్డలు లేకుండా చిలికిన పెరుగు వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాల తర్వాత గ్లాసు నీళ్లు పోసి ఉడికించాలి. మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చికెన్‌ బాగా ఉడికి నూనె పైకి తేలుతుంది.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్‌ స్వీట్‌.. వీటిని కలిపారంటే టేస్ట్‌ ఎవర్‌ గ్రీన్‌.!

ఇప్పుడు తాజా క్రీమ్‌ వేసి మరోసారి కలిపి కాసేపు ఉడికించిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే.. మొఘలాయ్‌ స్టైల్‌లో చూడగానే నోరూరించే పురాతన కాలం నాటి వంటకం రెడీ. రెస్టారెంట్‌ రుచితో అదిరిపోతుంది.

ఈ మహారాణి చికెన్‌ కర్రీ రోటీ, బటర్‌ నాన్‌లోకి సూపర్‌ కాంబినేషన్‌గా ఉంటుంది. ఇంకొంచెం అంటూ కొసరి కొసరి వడ్డించుకుని తింటారు. ఈ వీకెండ్‌కి తప్పకుండా ట్రై చేయాల్సిన నాన్‌ వెజ్‌ రెసిపీ..

[ of 5 - Users]
Story first published: Saturday, August 15, 2026, 11:44 [IST]
Desktop Bottom Promotion