పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..

Posted By:

పెళ్లి భోజనాల్లో పెట్టే రవ్వ కేసరి తింటుంటే అలా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది కదా. మీ ఇంట్లో ఎన్నిసార్లు చేసినా ఆ కేటరింగ్ స్టైల్ సాఫ్ట్‌ నెస్, మెరుపు రావడం లేదని అనిపిస్తుందా?

అయితే పెళ్లిళ్లలో కేటరింగ్ వంటవాళ్లు వాడే టిప్స్ తో మీరు కూడా ఇంట్లోనే సరిగ్గా అదే రుచితో, గంటల తరబడి ఆరని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ఆగస్టు 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏదైనా ప్రత్యేకమైన స్వీట్ చేయాలనుకున్నా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. చల్లారిన తర్వాత కూడా కేసరి గట్టిపడకుండా, రోజంతా సాఫ్ట్‌ గా ఉండేలా చేసుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి.

Independence Day 2026 Special Sweet Recipe How to Make Wedding Style Rava Kesari at Home in Telugu

వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి తయారీకి కావాల్సినవి

బొంబాయి రవ్వ: 1 కప్పు
నీళ్లు: 4 కప్పులు
చక్కెర: ఒకటిన్నర కప్పులు
నెయ్యి: పావు కప్పు
నూనె: పావు కప్పు

చూస్తే జాతీయ జెండా, తింటే అమృతం..ఆగస్టు 15 కోసం నోట్లో వేస్తే కరిగిపోయే ట్రై కలర్ కోకోనట్ బర్ఫీ..

వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి తయారీ విధానం

-స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్షలను దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.

-అదే బాణలిలో బొంబాయి రవ్వను సన్నని మంటపై మంచి సువాసన వచ్చే వరకు వేయించండి.

-మరోపక్క స్టవ్ మీద గిన్నెలో కొలత ప్రకారం నీటిని బాగా మరిగించి, కావాలంటే చిటికెడు కుంకుమపువ్వు రంగు కలపండి. మరుగుతున్న నీళ్లలో వేయించిన రవ్వను వేస్తూ గడ్డలు కట్టకుండా నిరంతరం తిప్పుతూ ఉండాలి.

-రవ్వ నీటిని పూర్తిగా పీల్చుకుని ఉడికిన తర్వాత మాత్రమే చక్కెర వేసి బాగా కలపాలి.

-ఇప్పుడు నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కేసరిని తిప్పుతూ ఉండాలి. తర్వాత యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసి కలపండి.

-కేసరి పాత్ర అంచులను వదిలేసి, మెరుస్తూ దగ్గరపడినప్పుడు దించేయండి.

-కేసరి గంటల తరబడి ఆరిపోకుండా, జిడ్డుగా మారకుండా మెత్తగా ఉండాలంటే కేవలం నెయ్యి మాత్రమే కాకుండా సగం నెయ్యి, సగం నూనె వాడండి. ఇది కేసరిని ఎక్కువ సేపు సాఫ్ట్‌ గా, షైనీగా ఉంచుతుంది.

-ఈ కొలతలతో ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. కుటుంబ సభ్యులంతా లొట్టలేసుకుంటూ తింటారు.

[ of 5 - Users]
Story first published: Saturday, August 15, 2026, 10:32 [IST]
Desktop Bottom Promotion