Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
Sankranti 2025: సంక్రాంతికి కచ్చితంగా చేసుకోవాల్సిన కొబ్బరి బూరెలు.. ఎలా చేసుకోవాలో తెలుసా?
సంక్రాంతి అంటేనే ప్రతి తెలుగు వ్యక్తికి గుర్తుకొచ్చేది ఎంతో ఇష్టమైన పిండి వంటలు. సంక్రాంతికి రకరకాల పిండి వంటలు చేస్తారు. వాటిని కొన్ని రోజుల పాటు పల్లెటూరిలో పచ్చని చెట్ల మధ్యలో కూర్చొని తింటూ మళ్ళీ పట్నానికి వచ్చేటప్పుడు వాటిని బ్యాగుల్లో పెట్టుకొని తీసుకొస్తుంటాం. వాటిని తినేటప్పుడు వాటి రుచి, ఆ కమ్మదనం వర్ణించడం కూడా చాలా కష్టం. అలా ఊహించుకుంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది కదూ..
అయితే ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఓ ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేస్తారు. అదే కొబ్బరి బూరెలు. ఇవి తినడానికి ఎంతగానో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ సంక్రాంతికి మీ ఇంటికి వచ్చే కొడుకు, కూతుళ్ళకు ఈ కొబ్బరి బూరెలు పెట్టి వారిలోని కుంభకర్ణుడిని శాంతపరచండి. ఇంతకీ ఈ కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అందుకే కదండీ మేమున్నది.. మీకోసం ఈ కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది అంతా ఈ స్టోరీలో వివరించాం. చదువుకొని వంటలు చకచకా చేసేయండి..

కొబ్బరి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - 1 కిలో
పచ్చి కొబ్బరి - 1 కిలో
బెల్లం - 500 గ్రాములు
యాలకుల పొడి - 1 టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత
వంటసోడా - అర టీస్పూన్
కొబ్బరి బూరెలు తయారీ విధానం
ముందుగా మనం తీసుకున్న బెల్లంను ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం వాటిని ఓ నీటిలో వేసుకొని మందపాటి పాకం మాదిరిగా చేసుకోని పక్కన పెట్టుకోవాలి. పాకం చల్లారిన తరువాత దానిని ఓ మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి. అనంతరం దానిని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కొబ్బరి తీసుకొని దానిని బాగా తురుముకోవాలి. వీలైతే కొబ్బరి తురుముతో తురుముకోవాలి. లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని తురుముకోవచ్చు. ఇప్పుడు ఓ పాత్ర తీసుకోవాలి. అందులో బియ్యం పిండి, కొబ్బరి తురుము, బెల్లం పాకం, యాలకుల పొడి వంటసోడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపై ఓ కడాయి పెట్టుకోవాలి. అందులో బూరెలు వేయించుకోవడానికి సరిపడా నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి బూరెలు చేసుకోవడానికి కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసుకోవాలి. ఆ బూరెలు రెండు వైపులా లేత బంగారు వర్ణంలోకి వచ్చేవరకు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత వాటిని ఓ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి బూరెలు సిద్ధమైనట్లే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications