Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఎముకల బలానికి, నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులకు దివ్యౌషధం..ఒక్క స్పూన్ తింటే రోజంతా ఫుల్ ఎనర్జీ!
మనం తినే ఫుడ్ రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండి ఉండటం చాలా అవసరం. అటువంటి సూపర్ ఫుడ్స్ లిస్ట్ లో డ్రై ఫ్రూట్స్ మిక్చర్ మొదటి స్థానంలో ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎముకల బలహీనత వంటి సమస్యలు రావు. మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు కూడా తగ్గుతాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలసటను వెంటనే తగ్గించి, మెదడుకు, శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్ మిక్చర్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఎండు ఖర్జూరం
-బాదం పప్పు
-జీడిపప్పు
-పుచ్చ గింజలు
-నువ్వులు
-ఎండు కొబ్బరి తురుము
-నెయ్యి
-కిస్మిస్
-గోండ్
-శొంఠి పొడి(ఎండిన అల్లం పొడి)
తయారీ విధానం
-ముందుగా 20 ఎండు ఖర్జూరాలను గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో అర లీటరు నీళ్లు పోసి మూత పెట్టి కొంచెం సేపు కాగనిస్తే చాలు..మరీ మరగాల్సిన పని లేదు.
-నీరు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు అందులో అర కప్పు(70గ్రా)బాదం పప్పు వేసి కలుపుకుంటూ 3 నిమిషాలు ఉడికించుకోవాలి.
-బాదంపప్పు మీద తొక్క ఈజీగా ఊడిపోయేలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి బాదంపప్పుని తీసి దానిమీద తొక్క తీసేసి బాదంపప్పుని సగంగా కట్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అర స్పూన్ నెయ్యి వేసుకొని అది కాగిన తర్వాత అందులో కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసి తక్కువ మంట మీద కలుపుతూ వేయించుకోవాలి.
-బాదంపప్పు సగం వరకు వేగిన తర్వాత అందులో అర కప్పు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి.
-జీడిపప్పు దోరగా వేగిన తర్వాత అందులోనే 1 కప్పు ఎండుకొబ్బరి తురుము వేసి బాగా వేయించుకున్నాక మొత్తం మిశ్రమాన్ని(జీడిపప్పు, బాదంపప్పు, ఎండుకొబ్బరి తురుము) ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మరో పాన్ ని లేదా అదే పాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో పావు కప్పు పుచ్చ గింజలు(watermelon seeds), పావు కప్పు నువ్వులు, కొద్దిగా నెయ్యి వేసి గసగసాలు చిటపటలాడే వరకు వేయించుకొని వీటిని బాదం కొబ్బరి మిశ్రమంలో వేసేయండి.
-మళ్లీ స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో పావు కప్పు కిస్మిస్ వేసి వేయించాక తీసి బాదం కొబ్బరి మశ్రమం ఉన్న గిన్నెలోనే పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లోనే 50గ్రాముల గోండ్(gond)వేసి వేయించాక ఇవి పొంగుతాయి. అప్పుడు వీటిని బయటకు తీసి మిక్సీలో లేదా రోట్లో దంచుకొని బాదం కొబ్బరి మిశ్రమం ఉన్న గిన్నెలో వేసేయండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ లో కొంచెం నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో కట్ చేసిన ఎండు ఖర్జూరం ముక్కలు వేసి బాగా వేయించాక వీటిమీద శొంఠిపొడి పావు టీస్పూన్ చల్లుకొని కలుపుకున్నాక వీటిని కూడా బాదం కొబ్బరి మిశ్రమం గిన్నెలోని వేసి బాగా కలుపుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్ మిక్చర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications