Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పాతకాలపు రాయల్ టేస్ట్..పసందైన షాహీ పులావ్ ఎలా చేసుకోవాలంటే..
షాహీ పులావ్ అనేది ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన, సుగంధభరితమైన వంటకం. పేరులోనే షాహీ (రాజసం) అనే పదం ఉండడం వల్ల ఇది ఒకప్పుడు రాజులు, నవాబులు తమ విందులలో ఆరగించిన వంటకంగా చెబుతారు. ఈ వంటకం దాని సువాసనకు, అద్భుతమైన రుచికి, పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉపయోగించి తయారు చేస్తారు. ఇది సాధారణ పులావ్ లా కాకుండా మరింత సంపన్నంగా, పోషక విలువలతో ఉంటుంది.
షాహీ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
-బాస్మతి బియ్యం: 2 కప్పులు
-నెయ్యి: 3-4 టేబుల్ స్పూన్లు
-ఉల్లిపాయలు: 1 పెద్దది
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
-క్యారెట్: 1
-బఠానీలు: అరకప్పు
-బంగాళదుంప: 1
-పన్నీర్ తురుము: 100 గ్రాములు
-జీడిపప్పు: 10-12
-బాదం పప్పు: 10-12
-కిస్మిస్: 1 టేబుల్ స్పూన్
-కొత్తిమీర: కొద్దిగా
పాలు: అరకప్పు
-ఉప్పు: తగినంత
-నీళ్ళు: 3 కప్పులు
-లవంగాలు: 3-4
-యాలకులు: 3-4
-దాల్చినచెక్క: 1 అంగుళం ముక్క
-బిర్యానీ ఆకు: 1
-షాహీ జీరా: అరటీస్పూన్
-మిరియాలు: 5-6
-పసుపు: పావు టీస్పూన్
-గరం మసాలా: పావు టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నానబెట్టాలి.
-ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ లో నెయ్యి వేసి వేడి చేయండి. అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే నెయ్యిలో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, షాహీ జీరా, మిరియాలు వేసి అవి సువాసన వచ్చే వరకు వేగించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి.
-క్యారెట్, బంగాళదుంప, బఠానీలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.
-నానబెట్టిన బియ్యాన్ని నీరు లేకుండా వడకట్టి గిన్నెలో వేసి నెయ్యితో కలిపి రెండు నిమిషాలు వేగించాలి. ఇలా చేయడం వల్ల బియ్యం విడివిడిగా ఉడుకుతాయి.
-ఇప్పుడు, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి.
-నీళ్లు, పాలు కలిపి బియ్యంలో పోయాలి. దీనికి వేయించిన పన్నీర్ ముక్కలు కూడా వేసి కలపాలి.
-కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఒకవేళ గిన్నెలో ఉడికించినట్లయితే మూత పెట్టి తక్కువ మంటపై నీరు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించాలి.
-పులావ్ ఉడికిన తర్వాత స్టవ్ ఆపి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. చివరిగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి వేడిగా వడ్డించండి.
-షాహీ పులావ్ కేవలం రుచిగా ఉండడమే కాకుండా, శరీరానికి పోషక విలువలను కూడా అందిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







