Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సొరకాయ అప్పాలు..ఒకటి రెండుతో ఆగరు,ఎలా చేసుకోవాలో చూడండి
సొరకాయ అనే పేరు వింటేనే కొందరు మొఖం పక్కకు తిప్పేసుకుంటారు. సొరకాయ కూర పేరు వింటే ఇక ఆ రోజు ఇంట్లో అన్నం కూడా తినరు కొంతమంది. వాస్తవానికి సొరకాయతో చేసే వంటకాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్లు కూడా దానితో తయారుచేసే ఓ వంటకం అంటే ఎగబడి మరీ తింటారు. అదే సొరకాయ అప్పాలు. దీనిని సొరకాయ గారెలు అని కూడా అంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారు మెచ్చే వంటకం ఇది.
తినడం మొదలుపెట్టారంటే ఒకటి రెండుతో ఆగరు..ఎన్ని తిన్నా అలా నోట్లోకి పోతూనే ఉంటాయి. మళ్లీ మళ్లీ ఇవి చేసిపెట్టాలని ఇంట్లో వాళ్ల కాళ్లు పట్టుకొని బతిమలాడటం గ్యారెంటీ. అంత రుచికరంగా ఉండే సొరకాయ అప్పాలు ఇంట్లో తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

సొరకాయ అప్పాలు తయారీకి కావలసిన పదార్థాలు
-400 గ్రాముల లేత సొరకాయ తరుగు
-ఉప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
-పచ్చిమిర్చి
-బియ్యం పిండి
-నువ్వులు
-నానబెట్టిన పెసరపప్పు
-నానబెట్టిన పచ్చి శెనగపప్పు
-జీలకర్ర
-ఉల్లిపాయ తరుగు
-ఆయిల్
మొరాకో స్పెషల్ చికెన్ టాగిన్..జిందగీలో మర్చిపోలేని టేస్ట్,ఎలా చేసుకోవాలో చూడండి
సొరకాయ అప్పాలు తయారీ విధానం
-ముందుగా లేత సొరకాయ ముక్కను శుభ్రంగా కడిగి తరుగుకొని పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో 10 పచ్చిమిర్చి,అర స్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు సొరకాయ తురుములో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర, అరకప్పు సన్నగా తరిగిన కరివేపాకు, పావుకప్పు నువ్వులు, గంటసేపు నానబెట్టిన పావు కప్పు పెసరపప్పు, గంట సేపు నానబెట్టిన పావు కప్పు పచ్చిశెనగపప్పు,రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలపాలి.
-తర్వాత అందులో 3 కప్పుల బియ్యం పిండి వేసి(సొరకాయ తరుము ఎన్ని కప్పులు వస్తే బియ్యం పిండి అన్ని కప్పులు ఉండాలి)వేసి కలిపి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ గట్టిగా లేదా మరీ పలుచగా కలపకూడదు.
-తర్వాత ఆ పిండిని ముద్దల్లా చేసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో పిండి ముద్దల్ని కొంచెం మందంగా గారెల షేపులో వత్తుకొని ఆయిల్ లో వేసి వేయించాలి. అంతే సొరకాయ అప్పాలు రెడీ. వీటిని చల్లారని తర్వాత తిన్నా కూడా అద్భుతమైన రుచితో ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications