Latest Updates
-
మంత్రాల చివర్లో వచ్చే.. స్వాహా, నమః వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
కామసూత్ర రహస్యాలు..శృంగారంలో మీ భాగస్వామికి స్వర్గసుఖాలు పరిచయం చేయండిలా! -
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్! -
మొటిమలు, చుండ్రుకు శాశ్వత పరిష్కారం: వన తులసితో మెరిసే చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం! -
వర్షాకాలం చలిలో వేడివేడిగా చికెన్ కీమా పరాఠా..అబ్బా ఆ రుచే వేరప్పా..చేసుకోండిలా.. -
జులై చివరి వారం.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే.! -
చెట్టినాడ్ శనగ కుర్మా..చపాతీతో తింటుంటే కిక్కే కిక్కు! -
రక్తహీనతకు చెక్,చర్మానికి గ్లో..పోషకాల గని బీట్ రూట్ తో కమ్మని హల్వా చేసుకోండిలా.. -
రోజుకు ఒక స్పూన్ పీనట్ బటర్ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
స్పైసీ, క్రంచీ చికెన్ మిక్చర్..ఆహా ఏమి రుచి అనాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
కరీనా కపూర్ ఫేవరెట్ సూప్ ఇదే..బెలెడు ప్రయోజనాలు..ఎలా చేసుకోవాలంటే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన ఫిట్నెస్, సింపుల్ డైట్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి ఖరీదైన డైట్లు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని, సులభంగా జీర్ణమయ్యే పౌష్టికాహారం తీసుకుంటే చాలని ఆమె తరచూ చెబుతుంటారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారంలో ఆమెకు అత్యంత ఇష్టమైనది సొరకాయ సూప్. మీరు కూడా తేలికైన, ఆరోగ్యకరమైన, త్వరగా పూర్తయ్యే వంటకం కోసం చూస్తున్నట్లయితే కరీనా కపూర్ ఫేవరెట్ సొరకాయ సూప్ మీకు బెస్ట్ ఆప్షన్.

సొరకాయ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఒక మోస్తరు సైజు సొరకాయ
-సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ
-3-4 వెల్లుల్లి రెబ్బలు
-ఒక చిన్న అల్లం ముక్క
-ఒక టీస్పూన్ నెయ్యి లేదా నూనె
-ఉప్పు
-అర టీస్పూన్ మిరియాల పొడి
-2-3 కప్పుల నీళ్లు
-కొద్దిగా కొత్తిమీర తరుగు
సొరకాయ సూప్ తయారీ విధానం
-ముందుగా సొరకాయను శుభ్రంగా కడిగి, పై తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. అందులో తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.
-ఆ తర్వాత సొరకాయ ముక్కలను అందులో వేసి రెండు నుంచి మూడు నిమిషాల
పాటు బాగా కలపాలి.
ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి, గిన్నెపై మూత పెట్టాలి. సొరకాయ ముక్కలు
పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి.
-ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, ఆ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ మిశ్రమాన్ని మళ్లీ గిన్నెలో పోసి స్టవ్ మీద ఉంచాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. అంతే పైన కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్!
సొరకాయ సూప్ తాగడం వల్ల ప్రయోజనాలు
-సొరకాయ సూప్ కడుపుకు చాలా తేలికగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది కాబట్టి రాత్రి భోజనానికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్.
-సొరకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి స్థాయిని తగ్గనివ్వకుండా ఉంచుతుంది.
-బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యౌషధం. సరైన వ్యాయామం చేస్తూ, రోజువారీ డైట్లో ఈ సూప్‌ను చేర్చుకుంటే బరువు సులభంగా అదుపులో ఉంటుంది.
-సొరకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications