Latest Updates
-
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
ఫైబర్, ప్రోటీన్ ఫుల్.. బార్లీ దోశ తింటే బాడీ సెట్!
వేడి వేడి కరకరలాడే దోశను, చట్నీలో అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు. కానీ ఆరోగ్య సమస్యల కారణంగా చాలా మంది తమకు ఇష్టమైన దోశను తినాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు బియ్యంతో చేసిన దోశలు తినాలంటే ఆలోచిస్తారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బియ్యం, రవ్వలకు దూరంగా ఉంటున్నారు.

ఇలాంటి సమయంలో బార్లీ దోశ ట్రై చేయాల్సిందే. ఇందులో ఒక్క గింజ కూడా బియ్యం గానీ, రవ్వ గానీ వాడాల్సిన అవసరం లేదు. బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరగకుండా అదుపులో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది. అలాగే దీని తయారీలో వాడే పెసర పప్పు వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల బలానికి, వెయిట్ లాస్ కి ఎంతో సహాయపడుతుంది.
బార్లీ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
బార్లీ గింజలు - అర కప్పు
పెసర పప్పు (పొట్టులేనిది) - అర కప్పు
మెంతులు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినంత
బార్లీ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బార్లీ గింజలు, పెసర పప్పు, మెంతులు వేయాలి. వీటిని శుభ్రమైన నీటితో 3 నుంచి 4 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా లేదా కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
-నానిన గింజల్లోని నీటిని వంపేసి, మిక్సీ జార్ లో వేయాలి. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. పిండి మరింత బాగా పులియడానికి, మీ చేతితో కానీ లేదా విస్కర్ సహాయంతో కానీ కనీసం 5 నిమిషాల పాటు బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. ఇలా చేయడం వల్ల గాలి చేరి ఫెర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది. ఆ తర్వాత మూతపెట్టి 6 నుండి 8 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
-పిండి పులిసిన తర్వాత, అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. దోశలు వేసుకోవడానికి వీలుగా పిండి మరీ గట్టిగా కాకుండా తగినన్ని నీళ్లు కలుపుకుని సరైన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడయ్యాక పలుచగా దోశలు వేసుకోవాలి. కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకుంటే.. కరకరలాడే బార్లీ దోశ రెడీ. మీకు ఇష్టమైన పల్లి చట్నీ లేదా అల్లం పచ్చడితో వేడివేడిగా లాగించేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
