Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అన్నం, చపాతీలోకి అదిరిపోయే వంకాయ మసాలా గ్రేవీ..ఎలా చేసుకోవాలంటే
మనలో చాలా మందికి వంకాయ కూర అంటే కొంచెం అలోచిస్తాం. కానీ అసలు రహస్యం వంకాయలో కాదు, మనం వండే విధానంలోనే ఉంది. సరిగ్గా సరైన మసాలాలు దట్టించి వండితే అబ్బ వంకాయ కూర ఇంత అద్భుతంగా ఉంటుందా? అని అనాల్సిందే. వంకాయ మసాలా కర్రీ అయితే..అన్నం, చపాతీ, రోటీ, పుల్కా..ఇలా దేనితో తిన్నా సరే, ఆ రుచికి దాసోహం అనాల్సిందే. ఈ కూర వండుతుంటే వచ్చే కమ్మని సువాసనకే సగం ఆకలి వేస్తుంది. వంకాయ మసాలా కర్రీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-లేత వంకాయలు - అర కిలో
-నూనె - 5 టేబుల్ స్పూన్లు
-దాల్చిన చెక్క - చిన్న ముక్క
-లవంగాలు - 3
-కరివేపాకు - రెండు రెబ్బలు
-పసుపు - అర టీస్పూన్
-కారం - రెండు టీస్పూన్లు
-ఉప్పు - రుచికి సరిపడా
-తాజా కొత్తిమీర - కొద్దిగా
-ధనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - అర టేబుల్ స్పూన్
సాంబారు ఉల్లిపాయలు - 6
వెల్లుల్లి రెబ్బలు - 6
అల్లం - ఒక అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2
ఎండుమిర్చి - 4
మిరియాలు - 1 టీస్పూన్
టమోటాలు - 2
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు

తయారుచేయు విధానం
-ముందుగా ఒక బాండీలో1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడిచేయండి. నూనె కాస్త వేడెక్కాక, అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి పచ్చివాసన పోయేవరకు దోరగా వేయించుకోవాలి.
తర్వాత తరిగిన టమోటాలు, కొద్దిగా ఉప్పు వేసి, టమోటాలు మెత్తబడే వరకు సుమారు 5 నిమిషాలు మగ్గించాలి. చివరగా, కొబ్బరి తురుము వేసి మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మసాలాను మిక్సీ జార్ లో వేసి ముందుగా నీళ్లు పోయకుండా కొంచెం బరకగా రుబ్బుకుని, ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని ముద్దలా చేసుకోవాలి.
-తర్వాత వంకాయలను ముక్కలుగా కోసి, ఉప్పు కలిపిన నీటిలో వేయండి. ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి.
-ఇప్పుడు మరో వెడల్పాటి పాన్ లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత నీటిలో నుంచి తీసిన వంకాయ ముక్కలను వేసి అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించాలి.
-ఇప్పుడు పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలు వంకాయలకు పట్టేలా ఒక నిమిషం వేయించండి.
-వంకాయ ముక్కలు సగం ఉడికిన తర్వాత, మనం సిద్ధం చేసుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలపాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి, ఆ నీటిని కూడా కూరలో పోయండి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు పాన్ పై మూతపెట్టి, చిన్న మంటపై నూనె పైకి తేలేంతవరకు సుమారు 10 నిమిషాలు ఉడికించాలి.
-వంకాయలు మెత్తగా ఉడికి, గ్రేవీ చిక్కబడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి, స్టవ్ ఆఫ్ చేయండి. అంతే నోరూరించే, కమ్మనైన వంకాయ మసాలా గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications