Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
స్పినాచ్ మరియు ఫెటా ఫలాఫెల్ బైట్స్ రెసిపీ
వర్షాకాలం రాబోతోంది. ఈ వర్షాకాలంలో వేడివేడివి తింటూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. వేడివేడి టీ తీసుకుంటూ పక్కనే స్పైసీ స్నాక్స్ ని తీసుకుంటూ ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు, టీ తో పాటు అమోఘమైన హాట్ ఛీజీ స్పినాచ్ మరియు ఫలాఫెల్ బైట్స్ ని ప్రయత్నిద్దాం. ఫెటా ఛీజ్ ని స్పినాచ్ మరియు ఫలాఫెల్ తో కలిపి డీప్ ఫ్రై ని చేయడం ద్వారా ఈ అమోఘమైన స్నాక్ ను తయారుచేసుకోవచ్చు. వీటిని, డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రై చేయడం ద్వారా కేలరీల కౌంట్ ను తగ్గించుకోవచ్చు. మీ స్నేహితులకి మీరు కిట్టీ పార్టీని అందించేటప్పుడు ఈ రెసిపీని ప్రయత్నించి వారికి వడ్డించి వారందరి అభినందనలు పొందండి.

Recipe By: పూజా గుప్తా
Recipe Type: స్నాక్స్
Serves: 3-4
-
బేబీ స్పినాచ్ - 2-3 కప్స్
నానబెట్టి వడగట్టిన చిక్పీస్ - అర కేజీ
ఫెటా ఛీజ్ - 1 కప్పు
జీలకర్ర - 2 టీస్పూన్స్
సాదా పిండి - ఒక కప్పు
వెజిటబుల్ ఆయిల్ - వేపుడుకి అవసరమైనంత
తగినంత తజకీ
-
ఒక చిల్లుల గిన్నె(కోలాండర్)లో బేబీ స్పినాచ్ ని తీసుకుని దానిపై మరుగుతున్న నీటిని పోయండి.
నీరు చల్లబడిన తరువాత స్పినాచ్ పై నున్న అదనపు నీటిని పిండండి.
ఇప్పుడు, నానబెట్టిన చిక్ పీస్, ఫెటా, జీలకర్ర మరియు సాదా పిండితో పాటు స్పినాచ్ ని ఫుడ్ ప్రోసెస్సర్ లో వేసి మెత్తగా నూరుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సైజ్ బాల్స్ ని తయారుచేసుకోండి. చేతులకు అంటుకోకుండా ముందుగా కాస్తంత పొడిని చేతులకు అడ్డుకుని ఈ బాల్స్ ని తయారుచేయండి. ఇప్పుడు వాటిని చదును చేయండి.
వెజిటబుల్ ఆయిల్ లో వీటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు వేచండి. ఆ తరువాత వీటిని చల్లారనివ్వండి.
ఇప్పుడు వీటిని బేకింగ్ ట్రే పైన పెట్టి క్లింగ్ ఫిలిం తో కప్పి ఉంచి ఫ్రీజ్ అవనివ్వండి.
వడ్డించడానికి వీటిని రాత్రంతా ఫ్రిడ్జ్ లో డీఫ్రాస్ట్ చేసుకోండి ఆ తరువాత 180C/160C fan/ gas లో అయిదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేయండి.
తజకితో దీనిని సర్వ్ చేసుకోండి.
ఇవి 3 నెలల వరకు ఫ్రోజెన్ గా నిల్వవుంటాయి.
బేకింగ్ ట్రేస్ లేకపోతే, ఈ కాన్ఫెస్ అనేవి సాలిడ్ గా ఫ్రోజెన్ అయ్యాక వీటిని ఫ్రీజర్ బ్యాగ్స్ లోకి మార్చుకోండి.
వీటిని సరిగ్గా వ్రాప్ చేయండి. తద్వారా, ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.
వీటిని కరెక్ట్ గా లేబుల్ చేయండి.
- స్పినాచ్ నుంచి నీటిని మొత్తం పిండి వేయాలి. లేదంటే, ఫలాఫెల్ అనేది జారుగా అవుతుంది.
- సెర్వింగ్ సైజ్ - 2 బాల్స్
- Cal - 49
- ఫ్యాట్ - 3 గ్రాములు
- ప్రోటీన్ - 2 గ్రాములు
- కార్బోహైడ్రేట్స్ - 5 గ్రాములు
- డైటరీ ఫైబర్ - 1 గ్రాము
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications