Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Spinach Omelet: పాలకూర ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేసుకుంటే స్టార్ హోటల్ ఆమ్లెట్ కూడా పనికిరాదు
మన దేశంలో ఎన్నో రకాల ఆమ్లెట్స్ అందుబాటులో ఉన్నాయి. రకరకాలుగా ఆమ్లెట్లు వేసుకొని తినేవారు ఉన్నారు. మసాలా ఆమ్లెట్, ఆనియన్ ఆమ్లెట్, ప్రోటీన్ ఆమ్లెట్ ఇలా ఎన్నో రకాల ఆమ్లెట్లు ఉన్నాయి. కానీ మీరెప్పుడైనా పాలకూర ఆమ్లెట్ తిన్నారా? ఇది తినడం వల్ల ఆరోగ్యానికి పోషకాలతో పాటు మంచి శక్తి లభిస్తుందట. అలాగే రుచిలో అద్భుతంగా ఉంటుందట. ఇంతకీ ఈ పాలకూర ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాలకూర ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కట్టల పాలకూర
- నాలుగు లేదా ఆరు కోడి గుడ్లు
- ఒక ఉల్లిపాయ
- మూడు పచ్చి మిర్చి
- చిటికెడు మిర్యాల పొడి
- కొంచెం జీరకర్ర పొడి
- కొద్దిగా గరం మసాలా
- చిటికెడు ధనియాల పొడి
- నూనె
పాలకూర ఆమ్లెట్ తయారీ విధానం
ఈ పాలకూర ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి ముందుగా తెచ్చి పెట్టుకున్న పాలకూర నాడలను కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో పాలకూర, అలాగే పాలకూర ఉడికేందుకు సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. పాల కూర మెత్తగా ఉడికిన తరువాత వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఉడకబెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను సన్నగా తరుగుకొని అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. దీంతో పాటు చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మిర్చిని కూడా వేసుకోవాలి.
ఆ తరువాత అందులో చిటికెడు మిర్యాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు నాలుగు గుడ్లను ఒక దాని వెనుక ఇంకొకటి పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు పాలకూరకు బాగా కలిసే విధంగా బాగా గిలకొట్టుకోవాలి. గుడ్డు మొత్తం పాలకూర మిశ్రమానికి బాగా కలిసి పోయేంత వరకు గిలకొట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పెనం తీసుకొని దానిపై కొద్దిగా నూనె పోసుకోవాలి. ఆ నూనె మొత్తం పెనంకు పూసుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ కాలిపోకుండా శుభ్రంగా ఉంటుంది. నూనె పూసుకోవడంతో పాటు పెనం వేడయ్యాక.. దానిపై ముందుగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ వేసుకోవాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఆమ్లెట్ కాలిన తరువాత ఒక ప్లేట్లో తీసుకునే పాలకూర ఆమ్లెట్ సిద్ధమైనట్లే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. కావాలంటే మీరూ ఓసారి ట్రై చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications