Latest Updates
-
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా..
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా!
ఎప్పుడూ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీల్లోకి ఒకే రకమైన చట్నీలు, కుర్మాలతో విసుగొచ్చిందా? అయితే కాస్త కొత్తగా, అదిరిపోయే రుచితో ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? పెద్దపెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎన్ని రకాల వంటకాలు తిన్నా.. రోడ్డు పక్కన బండి మీద దొరికే పరోటా, దానిపై పోసే వేడి వేడి శార్వా రుచికి ఏదీ సాటి రాదు కదూ.
ఆ ఘుమఘుమలు గుర్తొస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇక దానికి గుడ్డు కూడా తోడైతే ఆ మజాయే వేరు. ఈ రోడ్‌సైడ్ స్టైల్ ఎగ్ శార్వా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఎగ్ శార్వా తయారీకి కావలసిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం
పచ్చి కొబ్బరి తురుము: 1/4 కప్పు
జీడిపప్పు: 15
గసగసాలు: 1 టీస్పూన్
శనగపిండి: 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి: 2
యాలకులు: 1, లవంగాలు: 2
అల్లం ముక్క: 1 అంగుళం
సోంపు: 1/2 టీస్పూన్
గరం మసాలా: చిటికెడు
నీళ్లు: 1/2 కప్పు
గ్రేవీ కోసం
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క: అర అంగుళం ముక్క
సోంపు, జీలకర్ర: పావు టీస్పూన్ చొప్పున
కరివేపాకు: 1 రెమ్మ
ఉల్లిపాయలు: 1/2 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
కారం: 3/4 టీస్పూన్
ధనియాల పొడి: 1.5 టీస్పూన్
కర్రీ మసాలా లేదా గరం మసాలా: 1/2 టీస్పూన్
సన్నగా తరిగిన టమాటాలు: అర కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
ఉడికించిన గుడ్లు: 4
కొత్తిమీర తురుము: 2 టీస్పూన్లు
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి!
ఎగ్ శార్వా తయారీ విధానం
-ముందుగా మసాలా పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలన్నింటినీ (కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, శనగపిండి, పచ్చిమిర్చి, అల్లం, మసాలా దినుసులు) ఒక మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.
-అలాగే గుడ్లను ముందుగానే ఉడికించి, పొట్టు తీసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకుని నూనె వేయాలి. నూనె వేడెక్కాక దాల్చిన చెక్క, సోంపు, జీలకర్ర, లవంగాలు, కరివేపాకు వేసి సువాసన వచ్చేలా దోరగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత గోధుమ రంగులోకి మారేదాకా వేయించాలి.
-ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి పసుపు, కారం, ధనియాల పొడి, కర్రీ మసాలా వేసి ఒక్క నిమిషం పాటు బాగా కలపాలి. తర్వాత టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పంచదార వేసి బాగా కలపాలి. మూతపెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు 3-4 నిమిషాలు ఉడికించాలి.
-టమాటాలు నూనె పైకి తేలేలా ఉడికిన తర్వాత, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను ఇందులో వేయాలి. గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి, 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
-గ్రేవీ చిక్కబడి, పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గుడ్లను అందులో వేసి మరో 2 నిమిషాలు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను ఉదారంగా చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
-అంతే రోడ్‌సైడ్ ఎగ్ శార్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
