Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మిగిలిన అన్నంతో టేస్టీ,కరకరలాడే వడలు..డీప్ ఫ్రై లేకుండానే..ఎలా చేసుకోవాలంటే
రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చాలామంది పడేస్తుంటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో కొందరు టేస్టీ వంటకాలు తయారుచేస్తుంటారు. మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు వడలు చేసుకోవచ్చని మీకు తెలుసా? చాలా రుచిగా,క్రిస్పీగా అద్భుతంగా ఉంటాయి. మరో స్పెషల్ ఏంటంటే ఈ వడలను ఆయిల్ లో డీప్ ఫ్రై చేయకుండానే తయారుచేయవచ్చు. మరెందుకు ఆలస్యం మిగిలిపోయిన అన్నంతో టేస్టీ వడలను ఎలా తయారుచేయాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం
-జీలకర్ర
-ఎండుమిర్చి
-అల్లం
-పొడి బియ్యం పిండి
-కొత్తిమీర తరుగు
-కరివేపాకు
-ఉల్లిపాయ
-ఆయిల్
-నువ్వులు

తయారీ విధానం
-ముందుగా మిగిలిపోయిన అన్నం పొడిగా ఉంటే కొద్దిగా నీళ్లు చిలకరించి మెత్తగా మ్యాష్ చేయండి. ఇది వడలకు మంచి ఆకృతిని ఇస్తుంది.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 1 కప్పు మిగిలిపోయిన అన్నం,1 స్పూన్ .జీలకర్ర, 3 ఎండు మిరకాయలు, రెండు ఇంచుల చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి నీళ్లు పోయకుండానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ రైస్ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకొని అందులో 1 కప్పు పొడి బియ్యం పిండి,గుప్పెడు నువ్వులు, కట్ చేసిన ఉల్లిపాయ, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు,రుచికి సరిపడా వేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోండి. కొంచెం ఆయిల్ వేసి వడలు చేయడానికి వీలుగా గట్టి ముద్దలా కలపండి. పిండి మరీ పల్చగా ఉండకూడదు.
ఇడ్లీ,దోశ కాదు..మన పూర్వీకులు పొద్దున్నే తిన్నది ఇదే..కొండలను ఢీకొట్టే శక్తి..ఎలా చేసుకోవాలంటే
-తర్వాత చేతులకు ఆయిల్ రాసుకొని పిండిని చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని అరిటాకు లేదా ప్లాస్టిక్ షీట్ పై వడల ఆకారంలో ఒత్తుకోండి. మధ్యలో చిన్న రంధ్రం చేస్తే వడలు లోపల కూడా బాగా ఉడుకుతాయి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ చిలకరించండి.
-తర్వాత వత్తుకున్న వడలను పాన్ లో పెట్టి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పి కాల్చుకోండి. లైట్ గా గోధుమ బంగారు రంగులోకి వచ్చాక వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకోండి. అంతే క్రిస్పీ వడలు రెడీ. నచ్చిన చట్నీతో దీన్ని ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications