Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సూపర్ హెల్దీ రాగి తోప..రక్తం పట్టడానికి, ఉక్కులాంటి ఎముకల కోసం ఇదే సరైనది..ఎలా చేసుకోవాలంటే
రాగి తోప అనేది సంప్రదాయ భారతీయ స్వీట్. ఇది రాగి పిండితో తయారు చేయబడుతుంది. ఇది రుచికరమైనది మాత్రమే కాదండోయ్.. పోషకాలతో నిండిన ఒక బలమైన ఆహారం కూడా. రాగులు పోషక విలువలు అధికంగా ఉండే ధాన్యాలు. రాగి తోపలో రాగి పిండి ప్రధాన పదార్థం కాబట్టి, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, ఎముకల బలహీనత ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని తయారుచేయడం చాలా ఈజీ. అంతేకాదండోయ్ ఇది రెండు మూడు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. రాగి తోప తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
రాగి తోప తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-బెల్లం
-రాగి పిండి
-యాలకల పొడి
-నీళ్లు
-పచ్చి కొబ్బరి తురుము

రాగి తోప తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు తురిమిన బెల్లం,2 కప్పుల నీళ్లు పోసి మీడియం మంట మీద బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి.
-తర్వాత ఈ బెల్లం నీళ్లను వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగిన తర్వాత ఇందులోనే 1 కప్పు రాగి పిండి వేసి తక్కువ మంట మీద రాగిపిండిని నెయ్యిలో కమ్మని వాసన వచ్చేదాకా 2-3 నిమిషాలు వేయించాలి.
-రాగిపిండి వేగిన తర్వాత అందులో అరకప్పు పచ్చికొబ్బరి తురుము వేసి తక్కువ మంట మీద మరో 2 నిమిషాలు వేయించాలి.
-మంచి సువాసన వచ్చేదాకా వేయించాక అందులో కరగబెట్టిన బెల్లం నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని కలుపుకోవాలి.
-తర్వాత అందులో కొద్దిగా నెయ్యి, అర టీస్పూన్ యాలకల పొడి వేసి బాగా కలుపుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. చివర్లో దించేముందు కూడా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అందులో వేసి కలుపుకోండి.
-పాన్ నుంచి రాగి తోపా సపరేట్ అవుతుందో అప్పుడు రెడీ అయిందని అర్ధం. దీనిని వేడిగా తిన్నా లేదా చల్లగా తిన్నా ఎలా తిన్నా రుచిగానే ఉంటుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇది 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది.
ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు
రాగి తోప అనేది పాతకాలం నాటి బలమైన ఆహార పదార్థాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రాగుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని నెమ్మదిగా విడుదల చేస్తుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు, పీరియడ్స్ టైంలో ఐరన్ అవసరం ఎక్కువగా ఉన్న స్త్రీలకు ఇది చాలా మంచిది. రక్తహీనతతో బాధపడే వారికి ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.
రాగి తోప పిల్లల ఎదుగుదలకు, వారి ఎముకలు, కండరాల బలానికి చాలా మంచిది. ఇది వారికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రాగుల్లోని ఫైబర్, మెగ్నీషియం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాగుల్లోని అధిక ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు కలిగిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది,తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications