Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కేవలం 10 నిమిషాల్లో పోషకాలతో నిండిన మూంగ్ కట్ లెట్..కేక పెట్టించే టేస్ట్..ఎలా చేసుకోవాలంటే..
మూంగ్ లెట్ అనేది పెసరపప్పుతో చేసే ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం. ఇది సాధారణంగా ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. ఇది ఒక రకమైన దోశ లేదా ప్యాన్ కేక్ లాంటిది, కానీ ఇందులో పులియబెట్టిన పిండిని వాడకుండా తాజా పిండిని ఉపయోగిస్తారు. మూంగ్ లెట్ ను అల్పాహారంగా, స్నాక్ గా లేదా లంచ్ బాక్స్‌లో కూడా తీసుకోవచ్చు. వేగవంతమైన, సులభమైన తయారీ విధానం, అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలు దీనిని ఇంటిల్లిపాదికీ ఇష్టమైన వంటకంగా మార్చేస్తాయి. దీనిని గ్రీన్ చట్నీతో తింటే టేస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. మూంగ్ లెట్,గ్రీన్ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
మూంగ్ లెట్,గ్రీన్ చట్నీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-పెసరపప్పు
-పసుపు
-క్యాప్సికమ్
-క్యారెట్
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిరపకాయ
-కొత్తిమీర
-ఉల్లిపాయ
-జీడిపప్పు
-జీలకర్ర పొడి
-ఆమ్చూర్ పొడి
-ఉప్పు
-టమాటో
-వంటసోడా
-నూనె లేదా నెయ్యి

తయారీ విధానం
-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పు(పొట్టు ఉన్న, పొట్టు లేనివి కలిపి) వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం 4 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత నీళ్లు వంపేసి పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసి ఇందులోనే 1 ఇంచు అల్లం, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసుకున్న పిండిని ఓ బౌల్ లో వేయండి. ఈ పిండిలోనే 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, అరకప్పు ఉల్లిపాయ తరుగు, పావుకప్పు సన్నని టమాటో తరుగు, పావు కప్పు క్యారెట్ తురుము, పావు కప్పు క్యాప్సికమ్ తరుగు, పావు కప్పు కొత్తిమీర తరుగు,రుచికి సరిపడా ఉప్పు,పావు టీస్పూన్ వంటసోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు గ్రీన్ చట్నీ తయారీకోసం మిక్సీ జార్ లో 1 కప్పు కాడలతో సహా కొత్తిమీర తరుగు, పావు ఇంచు అల్లం, 2 పచ్చిమిరపకాయలు, పావు ముక్క ఉల్లిపాయ, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ ఆమ్చూర్ పౌడర్ లేదా నిమ్మరసం అయినా వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. మూంగ్ లెట్ లోకి కావాల్సిన గ్రీన్ చట్నీ రెడీ.
-తర్వాత మూంగ్ లెట్ తయారుచేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేశాక మూడు నాలుగు గరిటల పిండిని వేసి అరఇంచు మందంలో ఊతప్పంలో వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే నచ్చిన కూరగాయల ముక్కలను దీనిమీద చల్లుకున్నట్లు వేసుకొని మూతపెట్టేసి తక్కువ మంటమీద మగ్గనివ్వాలి.
-2 నిమిషాల తర్వాత మూతతీసి మూంగ్ లెట ని రెండోవైపుకి తిప్పి మళ్లీ మూతపెట్టి మరో నిమిషం పాటు ఉడికించాలి. అంతే మూంగ్ లెట్ రెడీ. దీనిని గ్రీన్ చట్నీతో తింటే ఆ కిక్కే వేరు
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications