Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సైడ్ డిష్ అక్కర్లేదు,ఒట్టిగానే లాగించేయొచ్చు..ఆలూ పులావ్ క్షణాల్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూడండి
పులావ్ లో బోలెడు వెరైటీలు ఉంటాయి. అందులో ఆలూ పులావ్ ఒకటి. సుగంధ ద్రవ్యాలు, బంగాళదుంపలు, బాస్మతి బియ్యంతో తయారుచేసే ఆలూ పులావ్ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఏ వయస్సు వారైనా సరే లొట్టలేసుకొని తింటారు. దీనికి సైడ్ డిష్ గా ఎలాంటి కర్రీ కూడా అక్కర్లేదు. ఒట్టిగానే దీన్ని ఆస్వాదించవచ్చు. దీనిని తయారుచేయడం కూడా చాలా ఈజీ. బ్యాచిలర్స్ కూడా తమ రూముల్లో దీనిని చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. నిమిషాల్లోనే రెడీ చేసుకోగలిగే ఆలూ పులాన్ ని మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ఆలూ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
-బంగాళదుంప
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-పచ్చి బఠాణీ
-క్యారెట్
-షాజీరా
-బిర్యానీ ఆకు
-దాల్చిన చెక్క
-ఉప్పు
-యాలకలు
-జాపత్రి
-మరాఠీ మొగ్గ
-లవంగ మొగ్గలు
-ఆయిల్
-కొత్తిమీర
-పుదీనా
-బాస్మతి బియ్యం
-టమాటో
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-కారం
-గరం మసాలా
ఆలూ పులావ్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీస్పూన్ నెయ్యి వేడి చెయ్యాలి.
-ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీస్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 4 యాలకలు, 1 జాపత్రి, 5 లవంగ మొగ్గలు, 1 మరాఠీ మొగ్గ, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి.
-మసాలా దినుసులు కొద్దిగా వేగాక అందులో సన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయ చీలికలు, 3 పచ్చిమిరపకాయల చీలకలు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అందులో కట్ చేసిన 1 కప్పు బంగాళ దుంప ముక్కలు, అరకప్పు క్యారెట్ ముక్కలు,అరకప్పు పచ్చి బఠాణీ, పావు టీస్పూన్ ఉప్పు వేసి కలిపి మూతపెట్టి అప్పుడప్పుడు కలుపుతూ మగ్గనివ్వాలి.
-తర్వాత అందులో కట్ చేసిన 2 టమాటలో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి.
-టమాటో ముక్కలు మగ్గిన తర్వాత అందులో సన్నగా తరిగిన పావు కట్ట కొత్తిమీర తరుగు, పావు కట్ట పుదీనా తరుగు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసి కలిపి అందులో 2 గ్లాసుల కడిగిన బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి 3 గ్లాసుల నీళ్లు అందులో పోయాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మంటలను మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి.
-రైస్ లోని వాటర్ ఇగురుతున్నప్పుడు మూతపెట్టేసి తక్కువమంట మీద 10 నిమిషాలు ఉడికిస్తే రైస్ లోని నీరు ఇగిరిపోతుంది. అంతే ఆలూ పులావ్ రెడీ. దీనిని ఏ చట్నీ లేకుండానే తినొచ్చు. రైతా కలుపుకుని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











