Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కేటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ..టేస్ట్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..
వంకాయ..కొందరు పేరు వినగానే మొఖం తిప్పేసుకుంటారు..మిరకొందరు ఎక్కడ ఎక్కడా అని ఎగబడతారు. వంకాయను వండే రీతిలో వండితే దీన్న మించిన టేస్టీ కూర ఇంకోటి ఉండదు. రుచిలో దీన్ని కొట్టే వంటకం లేదు. వంకాయలతో అనేక రకాల వంటకాలు తయారుచేస్తుంటారు. ఈ వెరైటీల్లో వంకాయ పకోడీ ఒకటి. సాధారణంగా మనం ఏదైనా పెళ్లిళ్లు లేదా పంక్షన్లకు పోయినప్పుడు అక్కడ భోజనాల్లో వంకాయ పకోడీ వడ్డించడం ఎక్కువగా చూస్తుంటాం. కేటరింగ్ స్టైల్లో చేసే వంకాయ పకోడీకి ఒక ప్రత్యేకమైన రుచి, సువాసన ఉంటాయి. పైగా, ఇది కేవలం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కేటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కేటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ తయారీకి కావలసిన
పదార్థాలు
-లేత వంకాయలు: 2 మీడియం సైజు
-శెనగపిండి: 1 కప్పు
-బియ్యప్పిండి: 1/4 కప్పు
-అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
-కారం: 1 టీస్పూన్
-ధనియాల పొడి: 1/2 టీస్పూన్
-జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
-పసుపు: 1/4 టీస్పూన్
-వాము: 1/2 టీస్పూన్
-ఇంగువ: చిటికెడు
-కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
-పుదీనా ఆకులు: 1 టేబుల్ స్పూన్
-పచ్చిమిర్చి: 1-2
-ఉప్పు: రుచికి సరిపడా
-వంట సోడా: చిటికెడు
-నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
-నీరు: అవసరమైనంత

కేటరింగ్ స్టైల్ వంకాయ పకోడీ తయారీ విధానం
-ముందుగా ఓ గిన్నెతో నీళ్లు పోసి ఉప్పు వేసి కలపండి.
-తర్వాత వంకాయలను శుభ్రంగా కడిగి, సన్నని చక్రాలుగా లేదా పొడవాటి ముక్కలుగా కట్ చేసి వాటిని వెంటనే ఉప్పు నీటిలో వేయండి. వేయించడానికి ముందు బాగా నీటిని పిండేయండి.
-తర్వాత ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి తీసుకోండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, వాము, ఇంగువ, తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, ఉప్పు, వంట సోడా వేసి అన్నింటినీ బాగా కలపండి. కొద్దికొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా పిండిని కలపండి. పిండి మరీ పల్చగా ఉండకూడదు,మరీ గట్టిగా కూడా ఉండకూడదు. వంకాయ ముక్కలకు బాగా పట్టుకునేలా ఉండాలి.
-ఒక మందపాటి కడాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాక వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా పిండిలో ముంచి జాగ్రత్తగా నూనెలో వేయండి. ఒకేసారి మరీ ఎక్కువ వేయకండి.
-మంటను మీడియంలో ఉంచి పకోడీలు బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు అన్ని వైపులా తిప్పుతూ వేయించండి.
-వేయించిన పకోడీలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి. అంతే వంకాయ ముక్కలతో పకోడీలు రెడీ.
-వేడివేడి వంకాయ పకోడీలను పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ లేదా కెచప్‌తో సర్వ్ చేయండి. సాయంత్రం వేళ టీ లేదా కాఫీతో ఈ పకోడీలు అద్భుతమైన స్నాక్ గా ఉంటాయి.
-డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి వీటిలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే వాటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. అలాగే నూనెను మంచి నాణ్యత గల నూనెను ఉపయోగించాలి
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications